King Of Kambala: ఇండియన్ ఉసేన్ బోల్ట్ అరుదైన ఘనత.. 46 మెడల్స్‌తో ఆల్ టైం రికార్డు..

King Of Kambala: కంబాల జాకీ శ్రీనివాస గౌడ ఆల్ టైం రికార్డును బద్దలకొట్టాడు. కర్ణాటకలో ఆదివారం ముగిసిన దున్నల పరుగుపందాల్లో అత్యధిక పతకాలను సాధించి అగ్రస్థానాన్ని చేరుకున్నాడు. 15 ఈవెంట్లలో 46 మెడల్స్ సాధించి ‘కింగ్ ఆఫ్ కంబాల’గా చరిత్ర సృష్టించాడు. టోర్నమెంట్ చివరిలో ముగిసిన జోడుకర కంబాల రేసులో ఏకంగా నాలుగు మెడల్స్ సాధించి తన పతకాల సంఖ్యను అమాంతం పెంచేశాడు. శ్రీనివాస గౌడ్ మొత్తంగా 35 గోల్డ్, 11 రజితాలు వెరిసి 46 మెడల్స్‌ను […]

King Of Kambala: ఇండియన్ ఉసేన్ బోల్ట్ అరుదైన ఘనత.. 46 మెడల్స్‌తో ఆల్ టైం రికార్డు..
Follow us

|

Updated on: Mar 10, 2020 | 10:45 PM

King Of Kambala: కంబాల జాకీ శ్రీనివాస గౌడ ఆల్ టైం రికార్డును బద్దలకొట్టాడు. కర్ణాటకలో ఆదివారం ముగిసిన దున్నల పరుగుపందాల్లో అత్యధిక పతకాలను సాధించి అగ్రస్థానాన్ని చేరుకున్నాడు. 15 ఈవెంట్లలో 46 మెడల్స్ సాధించి ‘కింగ్ ఆఫ్ కంబాల’గా చరిత్ర సృష్టించాడు. టోర్నమెంట్ చివరిలో ముగిసిన జోడుకర కంబాల రేసులో ఏకంగా నాలుగు మెడల్స్ సాధించి తన పతకాల సంఖ్యను అమాంతం పెంచేశాడు. శ్రీనివాస గౌడ్ మొత్తంగా 35 గోల్డ్, 11 రజితాలు వెరిసి 46 మెడల్స్‌ను సాధించాడు. కాగా, గతంలో కంబాలలో ఎక్కువ పతకాలు సాధించిన రికార్డు హుక్కేరి షెట్టి(32 మెడల్స్) పేరిట ఉంది. ఇప్పుడు దాన్ని తిరగరాసి శ్రీనివాస గౌడ తన పేరును లిఖించాడు.

ఇదిలా ఉంటే ఈ కంబాల రేసర్ ఇటీవల జరిగిన 142.5 మీటర్ల పందెంలో 13.62 సెకండ్లలో గెలవడంతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అంటే వంద మీటర్లను 9.55 సెకండ్లలో చేరుకున్నట్లు. ఇప్పటిదాకా ఈ రికార్డు ఉసేన్ బోల్డ్‌ది. అంతేకాకుండా ఈ రికార్డును చెరిపేసిన తర్వాత అదేరోజు శ్రీనివాస గౌడ్ మరో ఈవెంట్‌లో వందమీటర్లను 9.44 సెకండ్లలో పరిగెత్తి యావత్తు భారతదేశాన్ని ఆశ్చర్యపరిచాడు. అటు మరో జాకి నిషాంత్ షెట్టి కూడా 9.15 సెకండ్లలో వందమీటర్లను పూర్తిచేసి ఔరా అనిపించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సీజన్ మొత్తంలో శ్రీనివాస గౌడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. 15 ఈవెంట్లలో 46 మెడల్స్ సాధించి అగ్రస్థానం చేజిక్కించుకోవడమే కాకుండా.. ఎవరికీ అందనంత ఎత్తుకు చేరిపోయాడు.

For More News:

మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్…

సోషల్ మీడియాపై ఆసక్తి లేదు.. ఫ్యాన్ పేజీలకు సపోర్ట్ చేయనుః అజిత్

నిరుద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త…

విద్యార్థులకు అదిరిపోయే గిఫ్ట్.. ‘జగనన్న విద్యా కానుక’ కిట్స్ సిద్ధం…

కరోనా ఎఫెక్ట్.. విరాట్ కోహ్లీకి భారీ షాక్.. అక్కడ మ్యాచులు రద్దు.?

తెలంగాణలో ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు..

నగరవాసులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఈకో ఫ్రెండ్లీ ఫుడ్ జోన్..

కరోనా ఎఫెక్ట్.. దళపతి షాకింగ్ డెసిషన్… అభిమానులకు నిరాశేనా.?

కోహ్లీ, రోహిత్‌ల కంటే.. రాహులే ది బెస్ట్..

రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం