కేరళ స్థానిక ఎన్నికల్లో కొచ్చి కార్పొరేషన్ వార్డు బీజేపీ కైవసం, ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి

కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు బుధవారం ప్రారంభమైంది. కొచ్చి కార్పొరేషన్ నార్త్ ఐలాండ్ లో బీజేపీ అభ్యర్థి..కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.వేణుగోపాల్ ను ఓడించారు. కేవలం ఒక్క ఓటుతేడాతో వేణుగోపాల్ ఓడిపోయారు.

కేరళ స్థానిక ఎన్నికల్లో కొచ్చి కార్పొరేషన్ వార్డు బీజేపీ కైవసం, ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 16, 2020 | 1:38 PM

కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు బుధవారం ప్రారంభమైంది. కొచ్చి కార్పొరేషన్ నార్త్ ఐలాండ్ లో బీజేపీ అభ్యర్థి..కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.వేణుగోపాల్ ను ఓడించారు. కేవలం ఒక్క ఓటుతేడాతో వేణుగోపాల్ ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ తమ మేయర్ అభ్యర్థిగా ప్రకటించుకున్న ఈయన ఓటమి ఈ పార్టీకి దెబ్బే ! ఈ కార్పొరేషన్  గత పదేళ్లుగా యూడీఎఫ్ చేతిలో ఉంటూ వచ్చింది. పాలక్కాడ్ లో కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే లీడింగ్ లో ఉంది. 945 గ్రామ పంచాయతీలకు, 152 బ్లాకు పంచాయతీలు, 14 జిల్లా పంచాయతీలు, 86 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు గత గురువారం ఎన్నికలు జరిగాయి. చాలా చోట్ల లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్, యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్, నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ మధ్య ముక్కోణ పోటీ తీవ్రంగా ఉంది. 945 గ్రామ పంచాయతీలకు గాను 402 పంచాయతీలలో పాలక ఎల్ డీ ఎఫ్ లీడింగ్ లో ఉండగా విపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీ ఎఫ్ 343 పంచాయతీల్లో ఆధిక్యంలో ఉంది.

తిరువనంతపురం కార్పొరేషన్ లోని 100 వార్డుల్లో ఎల్ డీ ఎఫ్ 20, ఎన్డీయే 13, యూడీఎఫ్ 4 వార్డుల్లో లీడింగ్ లో ఉన్నాయి. ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..