లోని కేసులో ట్విటర్ ఇండియా ఎండీకి కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ఊరట.. ఘజియాబాద్ పోలీసులకు ‘షాక్’

ఘజియాబాద్ కి చెందిన లోని అనే వృద్దుడిపై దాడి కేసులో ట్విటర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరికి కర్ణాటక హైకోర్టు ఊరటనిచ్చింది.

  • Publish Date - 7:27 pm, Thu, 24 June 21 Edited By: Phani CH
లోని కేసులో ట్విటర్ ఇండియా ఎండీకి కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ఊరట.. ఘజియాబాద్ పోలీసులకు 'షాక్'
Manish Maheshwari

ఘజియాబాద్ కి చెందిన లోని అనే వృద్దుడిపై దాడి కేసులో ట్విటర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరికి కర్ణాటక హైకోర్టు ఊరటనిచ్చింది. ఆయనపై ఎలాంటి ‘బలవంతపు చర్యలు’ తీసుకోరాదని ఘజియాబాద్ పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో వారు తనకు జారీ చేసిన నోటీసును సవాలు చేస్తూ మనీష్ మహేశ్వరి ఈ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జైశ్రీరామ్ అనడానికి నిరాకరించినందుకు లోగడ లోనిపై కొందరు దాడి చేశారు. ఆ ఘటన తాలూకు ఫోటోలను ట్విటర్ సహా వివిధ సామాజిక మాధ్యమాలు షేర్ చేశాయి. ముఖ్యంగా ట్విటర్ ఇండియా ఎండీ కి ఘజియాబాద్ పోలీసులు నోటీసును జారీ చేస్తూ ఆయన వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాలని అందులో కోరారు. అయితే ఇందుకు నిరాకరించిన మనీష్ కర్ణాటకహైకోర్టుకెక్కారు. ఆయనను పోలీసులు విచారించదలిస్తే వర్చ్యువల్ గా విచారించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.

ప్రస్తుతానికి ఆయన యూపీ వెళ్ళవలసిన అవసరం లేదని సింగిల్ జడ్జి జస్టిస్ నరేందర్ అన్నారు. దర్యాప్తు కొనసాగించుకోవచ్చునని అంటూ…తన ఉత్తర్వులను ఈ నెల 29 వరకు రిజర్వ్ లో ఉంచుతున్నట్టు పేర్కొన్నారు.. అటు- తమ క్లయింటు ట్విటర్ ఇండియా ఉద్యోగి అని, ఈ నేరంతో ఆయనకు సంబంధం లేదని మనీష్ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు.

ఆయన బెంగుళూరులో నివసిస్తుంటారని, ఆయనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని సుప్రీంకోర్టు. హైకోర్టు కూడా సూచించినా ఘజియాబాద్ పోలీసులు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరుతున్నారని ఆ లాయర్ అన్నారు. కాగా ఈ కేసులో మనీష్ పై పోలీసులు ఎఫ్ఐ ఆర్ దాఖలు చేశారు. తనను మొదట సాక్షిగా తెలిపిన పోలీసులు రెండు రోజులకే నిందితునిగా పేర్కొన్నారని తొలుత మనీష్ ఆరోపించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: AP Exams: ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ర‌ద్దు.. అధికారికంగా ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి ఆది మూల‌పు..

Tokyo Olympics: ‘ఎంజాయ్ చేయాలంటే కుదరదు.. గమ్మున ఉండాల్సిందే’: జపాన్ ప్రభుత్వం!

Click on your DTH Provider to Add TV9 Telugu