ఇస్రో చైర్మన్‌కి.. అబ్దుల్‌ కలాం..!

ఇస్రో చైర్మన్‌ శివన్‌కు అరుదైన గౌరవం లభించింది. తమిళనాడు ప్రభుత్వం ఆయనకు అబ్దుల్ కలాం అవార్డును ప్రకటించింది. శాస్త్ర సాంకేతిర రంగాల్లో పురోగతి, అంతర్జాతీయ పరిజ్ఞానం వంటి రంగాల్లో విద్యార్థులకు అవగాహన కల్పించడంలో ఆయన మంచి చొరవ చూపారని గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం.. ఈ అవార్డును ప్రకటించింది. అబ్దుల్ కలాం అవార్డుతో పాటు ఆయనకు బంగారు కానుక, రూ.5 లక్షల నగదును అందజేయనున్నట్లు తెలిపారు. కాగా.. ఇస్రో చైర్మన్ శివన్‌ సార్థ్యంలో గత నెలలో చంద్రయాన్-2ని రోదసిలోకి […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:30 am, Fri, 16 August 19
ఇస్రో చైర్మన్‌కి.. అబ్దుల్‌ కలాం..!

ఇస్రో చైర్మన్‌ శివన్‌కు అరుదైన గౌరవం లభించింది. తమిళనాడు ప్రభుత్వం ఆయనకు అబ్దుల్ కలాం అవార్డును ప్రకటించింది. శాస్త్ర సాంకేతిర రంగాల్లో పురోగతి, అంతర్జాతీయ పరిజ్ఞానం వంటి రంగాల్లో విద్యార్థులకు అవగాహన కల్పించడంలో ఆయన మంచి చొరవ చూపారని గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం.. ఈ అవార్డును ప్రకటించింది. అబ్దుల్ కలాం అవార్డుతో పాటు ఆయనకు బంగారు కానుక, రూ.5 లక్షల నగదును అందజేయనున్నట్లు తెలిపారు. కాగా.. ఇస్రో చైర్మన్ శివన్‌ సార్థ్యంలో గత నెలలో చంద్రయాన్-2ని రోదసిలోకి పంపి చరిత్ర సృష్టించారు. ఇందుకు ఆయన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, పీఎం నరేంద్ర మోదీ పలువురు అభినందించిన విషయం తెలిసిందే.

ISRO Chairman Sivan gets A.P.J. Abdul Kalam Award