AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిలకడైన ఆటతీరును కనబరుస్తున్న టీమిండియా.. 40 ఓవర్లకు 94/3.. క్రీజులో రహానె, విహారి..

India Vs Australia 2020: మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా నిలకడైన ఆటతీరును కనబరుస్తోంది. 36/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో..

నిలకడైన ఆటతీరును కనబరుస్తున్న టీమిండియా.. 40 ఓవర్లకు 94/3.. క్రీజులో రహానె, విహారి..
Ravi Kiran
|

Updated on: Dec 27, 2020 | 7:57 AM

Share

India Vs Australia 2020: మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా నిలకడైన ఆటతీరును కనబరుస్తోంది. 36/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియాను ఆస్ట్రేలియా పేస్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ దెబ్బ తీశాడు. టెస్టుల్లో తొలి అర్ధ శాతానికి చేరువైన శుభ్‌మన్‌ గిల్‌(45; 65 బంతుల్లో 8×4)తో పాటు పుజారా‌(17; 70 బంతుల్లో 1×4)ను వరుస ఓవర్లలో పెవిలియన్‌కు పంపాడు. దీనితో టీమిండియా 64 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది.

ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ అజింక్య రహానె(13), హనుమ విహారి(14) ఉన్నారు. మూడో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును వీరిద్దరూ కలిసి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే 30 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 40 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ మూడు వికెట్లు నష్టపోయి 94 పరుగులు చేసింది.

Also Read:

హైదరాబాద్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో సోనూసూద్ సందడి.. చెప్పకుండానే అభిమాని ఇంటికి వచ్చిన రియల్ హీరో..!

కాంట్రాక్టు అధ్యాపకులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. గడువు పొడిగింపు.!

 ఏపీలో కొత్త ‘స్ట్రెయిన్’ కలవరం.. యూకే నుంచి వచ్చినవారిలో నలుగురికి పాజిటివ్.!