బాక్సింగ్ ప్రపంచ కప్‌లో భారత్ హవా..మూడు బంగారు, రెండు రజితం, నాలుగు కాంస్య పతకాలతో దూకుడు

భారత బాక్సర్లు విజయ ఢంకా మోగిస్తున్నాడు. జర్మనీలోని కొలోన్‌లో జరుగుతున్న బాక్సింగ్ ప్రపంచ కప్‌లో భారత బాక్సర్లు సిమ్రన్‌జిత్ కౌర్, మనీషా బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు.

బాక్సింగ్ ప్రపంచ కప్‌లో భారత్ హవా..మూడు బంగారు, రెండు రజితం, నాలుగు కాంస్య పతకాలతో దూకుడు
Follow us

|

Updated on: Dec 20, 2020 | 5:37 PM

భారత బాక్సర్లు విజయ ఢంకా మోగిస్తున్నారు. జర్మనీలోని కొలోన్‌లో జరుగుతున్న బాక్సింగ్ ప్రపంచ కప్‌లో భారత బాక్సర్లు సిమ్రన్‌జిత్ కౌర్, మనీషా బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు భారత్ 9 పతకాలను భారత బాక్సర్లు సొంతం చేసుకున్నారు. ఆదివారం జరిగిన మహిళల 57 కేజీల ఫైనల్లో మనీషా 3-2తో మన దేశానికే చెందిన సాక్షిని ఓడించింది.

ఇదిలావుంటే.. సిమ్రన్‌జిత్ కౌర్ 4–1తో జర్మనీకి చెందిన మాయ కాలిన్‌హాన్స్‌పై విజయం సాధించి గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకుంది. మూడు బంగారు, రెండు రజితం, నాలుగు కాంస్య పతకాలతో మొత్తం 9 పతకాలు సాధించిన భారత బాక్సర్లు.. టోర్నమెంట్‌లో రెండవ స్థానంలో నిలిచింది. ఫైనల్స్‌లో వాకోవర్‌ లభించడంతో తొలి బంగారు పతకాన్ని అమిత్ పంగల్ సొంతం చేసుకున్నాడు.

పురుషుల 91 కిలోల విభాగంలో సతీష్ కుమార్ రజత పతకాన్ని దక్కించుకోగా… గాయం కారణంగా అతను ఫైనల్లో రాణించలేకపోయాడు. సెమీస్‌లో ఫ్రాన్స్‌కు చెందిన జామిల్లె డిని మొయిజేను ఓడించి సతీష్ కుమార్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఇక ఫైనల్‌లో జర్మనీకి చెందిన నెల్వి టైఫాక్‌తో పోటీకి దిగగా… గాయం కారణంగా, అతను వాక్‌ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది.

ఇక కరోనా తర్వాత జరిగిన తొలి టోర్నీలో భారత బాక్సర్లు అద్బుతమైన ప్రదర్శనతో మెడల్స్‌ను సొంతం చేసుకున్నారు. ప్రపంచ స్థాయిలో ఇలా మెరవడం భారత్‌లో మిగతా ఆటగాళ్లకు బూస్టింగ్‌గా మారింది.