IND Vs NZ: కివీస్‌తో తొలిటెస్ట్ గెలిస్తే.. టీమిండియా చరిత్ర సృష్టించినట్లే..

కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ టీమిండియా పేలవ ప్రదర్శన కనబరిచింది. కేవలం 165 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీసేన రెండో ఇన్నింగ్స్‌లో ధీటుగా సమాధానమిస్తోందని చెప్పాలి. ఈ టెస్టులో కోహ్లీసేన విజయం సాధిస్తే తప్పకుండా రికార్డు సృష్టిస్తుంది...

IND Vs NZ: కివీస్‌తో తొలిటెస్ట్ గెలిస్తే.. టీమిండియా చరిత్ర సృష్టించినట్లే..
Follow us

|

Updated on: Feb 23, 2020 | 2:44 PM

IND Vs NZ: కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ టీమిండియా పేలవ ప్రదర్శన కనబరిచింది. కేవలం 165 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీసేన రెండో ఇన్నింగ్స్‌లో ధీటుగా సమాధానమిస్తోందని చెప్పాలి. ఇక ఇప్పటివరకు టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆడిన ఏడింటిలోనూ టీమిండియా విజయం సాధించింది. అయితే ఈ టెస్ట్ సిరీస్‌ మాత్రం సవాల్‌గా మారింది.

Also Read: How To Check Fake Rs 2000 And Rs 500 Notes

ఇదిలా ఉంటే విదేశీ పిచ్‌ల్లో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 165 పరుగులు లేదా అంతకన్నా తక్కువ స్కోర్‌కు ఆలౌట్ అయిన సందర్భాల్లో ఎప్పుడూ కూడా విజయం సాధించలేదు. కేవలం మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా కూడా అవన్నీ స్వదేశీ పిచ్‌లపైనే సాధ్యమైంది. మరోవైపు సుమారు 59 టెస్టు మ్యాచ్‌ల్లో భారత్ 165 పరుగులు మొదటి ఇన్నింగ్స్‌లో సాధించింది. ఇక వాటిల్లో 40 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడగా.. 16 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. విదేశీ పిచ్‌ల్లో అయితే ఈ రికార్డు మరీ దారుణంగా ఉంది. ఆడిన 29 మ్యాచ్‌ల్లో 23 ఓడిపోగా.. 6 మ్యాచ్‌లను డ్రాగా ముగించారు.

Also Read: నన్ను చంపేయ్ అమ్మా.. 9 ఏళ్ళ చిన్నారి ఆవేదన.. వీడియో వైరల్..

అటు మొదటి టెస్టు గురించి ప్రస్తావిస్తే.. రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన ఎదురీదుతోంది. ప్రస్తుతం రహానే, విహారీలు క్రీజులో ఉన్నారు. ఈ టెస్ట్ మ్యాచ్ దాదాపు డ్రా అయ్యేలా కనిపిస్తోంది. నెగ్గే అవకాశాలు మాత్రం ఎక్కడ లేవు. అయితే టీమిండియా ఈ టెస్ట్ నెగ్గితే మాత్రం చరిత్ర సృష్టిస్తుంది. కానీ ఓడితే.. టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో తొలి ఓటమిని మూటగట్టుకుంటుంది.

Also Read: కోహ్లీ కంటే స్మిత్ గ్రేట్.. నెటిజన్లు కామెంట్స్…