రికార్డు సృష్టిస్తున్న.. స్వదేశీ యాప్స్..! 

గాల్వన్ ఘర్షణల నేపథ్యంలో.. దేశ రక్షణ దృష్ట్యా 59 చైనా యాప్‌లను కేంద్రం నిషేధించిన సంగతి విదితమే. మొబైల్‌ ఫోన్‌ యూజర్లలో  ప్రత్యామ్నాయ యాప్‌ల కోసం అన్వేషణ పెరిగింది. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులుగా

  • Tv9 Telugu
  • Publish Date - 5:29 am, Tue, 21 July 20
రికార్డు సృష్టిస్తున్న.. స్వదేశీ యాప్స్..! 

Increased Popularity to Domestic Apps: గాల్వన్ ఘర్షణల నేపథ్యంలో.. దేశ రక్షణ దృష్ట్యా 59 చైనా యాప్‌లను కేంద్రం నిషేధించిన సంగతి విదితమే. మొబైల్‌ ఫోన్‌ యూజర్లలో  ప్రత్యామ్నాయ యాప్‌ల కోసం అన్వేషణ పెరిగింది. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులుగా స్వదేశీ యాప్‌లను గుర్తించి డౌన్‌లోడ్‌ చేసుకుంటున్న యూజర్ల సంఖ్య ప్రతిరోజూ గణనీయంగా పెరుగుతోంది.

చైనా వస్తువులను బహిష్కరించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తున్న క్రమంలో.. వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్, హెల్లో వంటి చైనా మొబైల్‌ అప్లికేషన్లకు ప్రత్యామ్నాయంగా మన దేశానికి చెందిన చింగారి, ట్రెల్, మోజ్, జోష్‌ వంటి యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. స్వదేశీ యాప్‌లకు మేడిన్‌ ఇండియా అనే ట్యాగ్‌లైన్‌ ఉండటంతో వాటిని గుర్తించడం సులభంగా ఉంటోంది. చింగారి, ట్రెల్, మోజ్‌ వంటి స్వదేశీ యాప్‌లు కోటికి పైగా డౌన్‌ లోడ్స్‌ మైలు రాయిని దాటి రికార్డు సృష్టిస్తున్నాయి.

Also Read: గోవాలో ‘కోవ్యాక్సిన్’ హ్యుమన్ ట్రయల్స్ షురూ..