లాభాల్లో ఐసీఐసీఐ బ్యాంక్‌ దూకుడు

ఐసీఐసీఐ బ్యాంక్‌ తొలి త్రైమాసి లాభాల వెల్లడాంచింది. కన్సాలిడేటెడ్‌ నికర లాభం 24 శాతం వృద్ధి చెంది రూ.3,118 కోట్లుగా నమోదైంది. జీవిత, సాధారణ బీమాల్లో..

లాభాల్లో ఐసీఐసీఐ బ్యాంక్‌ దూకుడు
Follow us

|

Updated on: Jul 26, 2020 | 6:44 AM

icici bank net jumps 36% : ఐసీఐసీఐ బ్యాంక్‌ తొలి త్రైమాసి లెక్కలు ముగిశాయి. బ్యాంక్ లాభ, నష్టాలను వెల్లడించింది. కన్సాలిడేటెడ్‌ నికర లాభం 24 శాతం వృద్ధి చెంది రూ.3,118 కోట్లుగా నమోదైంది. జీవిత, సాధారణ బీమాల్లో వాటాల విక్రయం ద్వారా రూ.3,000 కోట్లు ఆర్జించిందని తెలిపింది. తైమ్రాసిక కాలంలో లాభం గణనీయంగా పెరిగిందని బ్యాంక్‌ పేర్కొంది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం రూ.33,868.89 కోట్ల నుంచి రూ.37,939.32 కోట్లకు పెరిగిందని ప్రకటించింది. కాగా స్టాండ్‌ ఎ లోన్‌ ప్రాతిపదికన నికర లాభం ఏకంగా 36 శాతం పెరిగి రూ.2,599 కోట్లకు చేరుకుందని వెల్లడించింది.