ధోనీ ! నీ సేవలు మాకు కావాలి’, అమిత్ షా

భారత క్రికెట్ కు ఎంఎస్ ధోనీ అందించిన విశేష సేవలకు హోం మంత్రి అమిత్ షా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఈ క్రీడను మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్లేందుకు..

ధోనీ ! నీ సేవలు మాకు కావాలి, అమిత్ షా

Edited By:

Updated on: Aug 16, 2020 | 2:01 PM

భారత క్రికెట్ కు ఎంఎస్ ధోనీ అందించిన విశేష సేవలకు హోం మంత్రి అమిత్ షా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఈ క్రీడను మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్లేందుకు ధోనీ కృషి చేస్తూనే ఉంటాడన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోనీ రిటైర్మెంట్ వల్ల ప్రపంచం అతని ‘హెలికాఫ్టర్ షాట్స్’ ని మిస్ అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇండియన్ క్రికెట్ కు కనీవినీ ఎరుగని సేవలు అందించిన ధోనీకి కృతజ్ఞతలు చెబుతున్న లక్షలాది అభిమానుల్లో తానూ ఉన్నానని అమిత్ షా అన్నారు.

ధోనీ కూల్ టెంపరేచర్ ఇండియాకు ఎన్నో ‘హాట్ ఎన్ కౌంటర్లను’ (విజయాలను) తెచ్చిపెట్టిందని అమిత్ షా చమత్కరించారు. మిస్టర్ కూల్ కెప్టెన్సీ కింద ఇండియా వేర్వేరు ఫార్మాట్లలో రెండు సార్లు వరల్డ్ ఛాంపియన్ షిప్స్ ను సాధించిందని, తన అసాధారణ, అద్భుత  స్టైల్ ఆట తీరుతో ఆయన కోట్లాదిమందిని మెస్మరైజ్ చేశాడని అమిత్ షా అభినందించారు.

 

Also Read

Loading...
Unable to load recommendations.
Follow Us