
పుట్టినరోజు అనేది ప్రతీ ఒక్కరికీ ప్రత్యేకమైనది. అందులోనూ తనువు, మనసు, ఆత్మంతా తెలంగాణే నిండిన మంత్రి కేటీఆర్ బర్త్ డే అంటే యావత్ తెలంగాణ అంతా ఒక పండగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు సినీ రాకీయ ప్రముఖులు, అభిమానులు కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.
‘డియర్ తారక్ హ్యాపీ బర్త్ డే. ప్రజలకు కేటీఆర్ ఎప్పుడూ అందుబాటులో ఉండే విధానం ఆనందం కలిగిస్తుంది. ప్రతీ విషయాన్ని వ్యక్తిగతంగా స్వీకరించి, క్షుణ్ణంగా పరిశీలించి సహాయం చేస్తారు. భవిష్యత్తులో ఇలాంటి సేవలు ప్రజలకు ఇంకా చేయాలి’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు చిరు.