బైక్‌కి రూ.23వేలు ఫైన్..పోలీసుల వద్దే వదిలేసి వెళ్లిన వాహనదారుడు

టూ వీలర్, కారు ఉందా మీకు? అయితే ఇకపై వాటికి సంబంధించిన అన్ని పత్రాలు దగ్గరే ఉంచుకోండి. డ్రైవ్ చేసేటప్పుడు ట్రాఫిక్ నియమాలు జాగ్రత్తగా పాటించండి. అందులో ఏవైనా లేకపోతే బస్సు, మెట్రో ట్రైన్‌ను ప్రిపర్ చేయడం బెటర్. ఎందుకంటారా?. ఢిల్లీలో ఓ వ్యక్తికి ట్రాఫిక్ రూల్స్ పాటించలేదని ఏకంగా రూ. 23వేలు ఫైన్ వేశారు పోలీసులు. అక్షరాల ఇరవైమూడు వేలు అండి.  ప్రభుత్వం నూతన మోటారు వాహన చట్టం సెప్టెంబర్‌ 1 నుంచి అమలులోకి తెచ్చిన […]

బైక్‌కి రూ.23వేలు ఫైన్..పోలీసుల వద్దే వదిలేసి వెళ్లిన వాహనదారుడు
Yes, you read that right, a challan for Rs 23,000 was issued by the Gurugram police to a traffic violator after he was found flouting multiple rules.
Follow us

|

Updated on: Sep 03, 2019 | 10:00 PM

టూ వీలర్, కారు ఉందా మీకు? అయితే ఇకపై వాటికి సంబంధించిన అన్ని పత్రాలు దగ్గరే ఉంచుకోండి. డ్రైవ్ చేసేటప్పుడు ట్రాఫిక్ నియమాలు జాగ్రత్తగా పాటించండి. అందులో ఏవైనా లేకపోతే బస్సు, మెట్రో ట్రైన్‌ను ప్రిపర్ చేయడం బెటర్. ఎందుకంటారా?. ఢిల్లీలో ఓ వ్యక్తికి ట్రాఫిక్ రూల్స్ పాటించలేదని ఏకంగా రూ. 23వేలు ఫైన్ వేశారు పోలీసులు. అక్షరాల ఇరవైమూడు వేలు అండి.  ప్రభుత్వం నూతన మోటారు వాహన చట్టం సెప్టెంబర్‌ 1 నుంచి అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజా ఫైన్స్ ప్రకారమే అతడికి వాయించేశారు.

వివరాల్లోకి వెళ్తే…ఢిల్లీకి చెందిన చెందిన దినేష్‌ మదన్‌ అనే వ్యక్తి తన టూ వీలర్‌పై ప్రయాణిస్తున్నాడు. ఇంతలో గురుగ్రామ్‌ పోలీసులు అతడిని ఆపారు. దినేష్‌ను లైసెన్సు, ఆర్‌సీ తదితర పత్రాలు చూపించమని అడిగారు. అవి ఇంటి దగ్గర ఉండటంతో దినేష్‌ చూపించలేకపోయాడు. ఇంటికి వెళ్లి తీసుకువస్తానని పోలీసులను అడిగినప్పటికీ వారు అనుమతించలేదు. అనంతరం పోలీసులు అతడికి లైసెన్సు, ఆర్‌సీ లేకపోవడం, హెల్మెట్‌ పెట్టుకోకపోవడం, ఇన్సూరెన్సు లేకపోవడం తదితర కారణాలతో నిబంధనలను అతిక్రమించాడని రూ.23వేలు జరిమానా విధించారు. ఈ జరిమానాకు సంబంధించిన ఛలాన్‌ను చూసిన దినేష్‌కు షాకవడం అతని వంతైంది. చివరకు చేసేదేం లేక సెకండ్‌ హ్యాండ్‌లో రూ.15వేలకు కొన్న తన ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలి వచ్చానని మీడియాకు వెల్లడించాడు.