జలవివాదం పై ఇరురాష్ట్రాల చర్చలు

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు పరిష్కరించుకునేందుకు రెండు ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. ఈనెల 24న నీటి వివాదాలపై చర్చించుకునేందుకు గవర్నర్ నరసింహన్ రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, నీటి పారుదలశాఖ ముఖ్యకార్యదర్శులతో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. వివిధ అంశాలపై చర్చించిన తర్వాత 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరో సమావేశం జరిగే అవకాశం ఉంది. కాగా, రంజాన్ సందర్భంగా గవర్నర్ నరసింహన్ ఇచ్చిన విందులో రెండు రాష్ట్రాల సీఎంలు పాల్గొని చర్చించిన తరువాత […]

జలవివాదం పై ఇరురాష్ట్రాల చర్చలు
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 17, 2019 | 6:56 PM

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు పరిష్కరించుకునేందుకు రెండు ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. ఈనెల 24న నీటి వివాదాలపై చర్చించుకునేందుకు గవర్నర్ నరసింహన్ రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, నీటి పారుదలశాఖ ముఖ్యకార్యదర్శులతో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. వివిధ అంశాలపై చర్చించిన తర్వాత 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరో సమావేశం జరిగే అవకాశం ఉంది. కాగా, రంజాన్ సందర్భంగా గవర్నర్ నరసింహన్ ఇచ్చిన విందులో రెండు రాష్ట్రాల సీఎంలు పాల్గొని చర్చించిన తరువాత హైదరాబాద్​లోని ఏపీ ఆధీనంలో ఉన్న భవనాలను తెలంగాణకు అప్పగించారు. దీనికి ప్రతిగా హైదరాబాద్​లో రెండు భవనాలు ఏపీకి ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఈ నెల 19కల్లా ఆంధ్రప్రదేశ్ తమ ఆధీనంలో ఉన్న భవనాలు ఖాళీ చేయనుంది. తర్వాత నీటి వివాదాలపై రెండు రాష్ట్రాలు దృష్టి సారించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఎస్.కె జోషి, ఎల్.వీ సుబ్రమణ్యంతో చర్చించారు. అనంతరం ఈ నెల 24న భేటీకి అంగీకరించారు.

కృష్ణాజలాలకు సంబంధించిన అంశంపై బ్రిజేష్​కుమార్ ట్రైబ్యునల్ ఎదుట రెండు రాష్ట్రాల వాదనలు వినిపిస్తున్నాయి. కృష్ణాజలాలపై రెండు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చి పరిష్కరించుకోవాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పట్టిసీమ ద్వారా గోదావరి నుంచి కృష్ణాలోకి మళ్లించే 80 టీఎంసీలలో 45 టీఎంసీలు తమకు కేటాయించాలని తెలంగాణ కోరుతుండగా, ఏపీ ప్రభుత్వం దీనికి అంగీకరించలేదు. గోదావరి నుంచి కృష్ణాలోకి తెలంగాణ 240 టీఎంసీలు మళ్లిస్తుందని, ఇందులో తమకు వాటా ఇవ్వాలని ఏపీ కోరుతుంది. గోదావరి నుంచి మళ్లించే నీటిపై రెండు రాష్ట్రాలు కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖకు, కృష్ణా,గోదావరి బోర్డులకు పలుమార్లు ఫిర్యాదులు చేశాయి. గోదావరి జలాల వినియోగంపై రెండు రాష్ట్రాలు ఓ అంగీకారానికి రావాల్సి ఉంది. కాగా, మళ్లీ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున శ్రీశైలం, నాగర్జునసాగర్ నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

Latest Articles
స్పాట్ ఫిక్సింగ్‌ కేసులో జైలుకు.. 5 ఏళ్ల నిషేధం.. కట్‌చేస్తే..
స్పాట్ ఫిక్సింగ్‌ కేసులో జైలుకు.. 5 ఏళ్ల నిషేధం.. కట్‌చేస్తే..
గొప్ప మైలేజీని అందించే బజాజ్ సీఎన్‌జీ బైక్‌లు..ఎప్పుడంటే..
గొప్ప మైలేజీని అందించే బజాజ్ సీఎన్‌జీ బైక్‌లు..ఎప్పుడంటే..
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా…? ఫామ్-16 విషయంలో ఆ తప్పు వద్దంతే
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా…? ఫామ్-16 విషయంలో ఆ తప్పు వద్దంతే
ఓటు వేయడానికి ఉదయాన్నే బయలుదేరాడు.. కేంద్రం సమీపంలోకి రాగానే..
ఓటు వేయడానికి ఉదయాన్నే బయలుదేరాడు.. కేంద్రం సమీపంలోకి రాగానే..
అందం ఈ వయ్యారితో పోటీలో ఒడి.. ఈమె వద్ద బందీగా మారిందేమో..
అందం ఈ వయ్యారితో పోటీలో ఒడి.. ఈమె వద్ద బందీగా మారిందేమో..
'తీవ్రమైన గాయాలు.. మెడిసిన్‌తోనే మైదానంలోకి ధోని'
'తీవ్రమైన గాయాలు.. మెడిసిన్‌తోనే మైదానంలోకి ధోని'
సైకిల్ బెల్ మాత్రమే మిగిలింది.. జగన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
సైకిల్ బెల్ మాత్రమే మిగిలింది.. జగన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
పీఎఫ్ సొమ్ము ఎన్ని రోజుల్లో అకౌంట్‌లో పడుతుందో తెలిస్తే షాకవుతారు
పీఎఫ్ సొమ్ము ఎన్ని రోజుల్లో అకౌంట్‌లో పడుతుందో తెలిస్తే షాకవుతారు
మా ముందు కోహ్లీ పప్పులుడకవ్.. అమెరికాలో ఆట కట్టిస్తాం: బాబర్
మా ముందు కోహ్లీ పప్పులుడకవ్.. అమెరికాలో ఆట కట్టిస్తాం: బాబర్
అయోధ్యలోని గోలు వీడియో వైరల్.. రెండు కోట్ల వ్యూస్..
అయోధ్యలోని గోలు వీడియో వైరల్.. రెండు కోట్ల వ్యూస్..