జగన్ సర్కారుకి గుడ్ న్యూస్: హైకోర్టు స్టే ఇవ్వడంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు భూముల కేసులో సుప్రీంకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఈ కేసును వారంలోగా తేల్చండి’ అని హైకోర్టుకు సూచించింది. తుళ్లూరు మాజీ తహశీల్దార్ అన్నే సుధీర్ బాబు కేసులో హైకోర్టుకు సుప్రీం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. కాగా, తుళ్లూరులో పేదలను మభ్యపెట్టి భూ కుంభకోణానికి పాల్పడిన వ్యవహారంపై ఏపీ సిఐడి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, సిఐడి దర్యాప్తు పై స్టే ఇవ్వాలని సుధీర్ బాబు ఏపీ […]

జగన్ సర్కారుకి గుడ్ న్యూస్: హైకోర్టు స్టే ఇవ్వడంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
Follow us

|

Updated on: Oct 01, 2020 | 2:18 PM

ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు భూముల కేసులో సుప్రీంకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఈ కేసును వారంలోగా తేల్చండి’ అని హైకోర్టుకు సూచించింది. తుళ్లూరు మాజీ తహశీల్దార్ అన్నే సుధీర్ బాబు కేసులో హైకోర్టుకు సుప్రీం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. కాగా, తుళ్లూరులో పేదలను మభ్యపెట్టి భూ కుంభకోణానికి పాల్పడిన వ్యవహారంపై ఏపీ సిఐడి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, సిఐడి దర్యాప్తు పై స్టే ఇవ్వాలని సుధీర్ బాబు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో సిఐడి దర్యాప్తును ఆపేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఏపీ హైకోర్టు ఉత్తర్వులను ఏపీ సర్కారు సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కీలకంగా స్పందించింది. హైకోర్టు ఈ తరహా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ అంశంలో కేస్ ఏమిటని.. హైకోర్టు వ్యాఖ్యలు ఎలా చేస్తుందని విస్మయం వ్యక్తం చేసిన సుప్రీం.. ‘దర్యాప్తుపై స్టే విధించవద్దని మేము అనేక సార్లు చెబుతూనే వస్తున్నాం’ అని పేర్కొంది. చట్టం తన పని తాను చేసుకునేలా అవకాశం ఉండాలంది. ఇలాఉండగా, ఎస్సీ, ఎస్టీ రైతులను బెదిరించి అసైన్డ్ భూములను మాజీ తహసిల్దార్ అన్నే సుధీర్ బాబు, బ్రహ్మానంద రెడ్డి లాక్కున్నారని సిఐడి అభియోగాలు మోపింది. తమకు భూములు ఇవ్వకుంటే ల్యాండ్ పూలింగ్ లో భూములు పోగొట్టుకోవాల్సి వస్తుందని సైతం వీళ్లు బెదిరింపులు చేశారని, ల్యాండ్ పూలింగ్ పథకం అమలు కంటే ముందే పేదల భూముల బదలాయింపు జరిగిందని పేర్కొంది. వీరి బెదిరింపులకు భయపడి పేదరైతులు భూములు అమ్ముకోగా ఆ భూములను టీడీపీ నేతలు తమ సొంతం చేసుకున్నట్టు కూడా పేర్కొంటున్నారు.