మూడు రోజులుగా పడిపోతున్న పసిడి.. 50 వేలకు దిగువకు వచ్చే ఛాన్స్..ఈ రోజు ఎంతో తెలుసా..

పండుగకు ముందు పరుగులు పెట్టిన పసిడి ధరలు ఆ తర్వాత పడుతూ... లేస్తోంది. బంగారం ధరలు ఈ వారంలో వరుసగా మూడో రోజు కూడా తగ్గాయి క్షీణించాయి.

  • Sanjay Kasula
  • Publish Date - 5:49 pm, Wed, 18 November 20
మూడు రోజులుగా పడిపోతున్న పసిడి.. 50 వేలకు దిగువకు వచ్చే ఛాన్స్..ఈ రోజు ఎంతో తెలుసా..

Gold and Silver Prices : పండుగకు ముందు పరుగులు పెట్టిన పసిడి ధరలు ఆ తర్వాత పడుతూ… లేస్తోంది. బంగారం ధరలు ఈ వారంలో వరుసగా మూడో రోజు కూడా తగ్గాయి క్షీణించాయి. ఆగస్ట్ 7 రూ.56,200 గరిష్ట ధరతో రూ.5,700 వరకు తక్కువగా ఉంది. గతవారం ఫైజర్ వ్యాక్సీన్ ప్రకటన నేపథ్యంలో పది గ్రాముల పసిడి రూ.1200 తగ్గింది.

ఇటీవల మోడర్న టీకా కూడా సానుకూల ప్రకటన చేసింది. వరుస వ్యాక్సీన్ ప్రకటనల నేపథ్యంలో పసిడిపై ఒత్తిడి పడుతోంది. బుధవారం ప్రారంభ సెషన్‌లో 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ -295.00 అంటే -0.58శాతం క్షీణించి రూ.50,471.00 పలికింది. రూ.50,600.00 ప్రారంభం కాగా, రూ.50,646.00 గరిష్టాన్ని, రూ.50,464.00 కనిష్టాన్ని పలికింది.

వెండి ధర కూడా యెల్లో మెటల్ దారిలోనే ప్రయాణిస్తోంది. ఈ రోజు రూ.300కు పైగా తగ్గింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.359.00 అంటే 0.57శాతం క్షీణించి రూ.62,889.00 వద్ద ట్రేడ్ అయింది. తద్వారా ఫ్యూచర్ సిల్వర్ రూ.63,000 దిగువకు వచ్చింది. రూ.62,897.00 ప్రారంభమై, రూ.63,029.00 గరిష్టాన్ని, రూ.62,808.00 కనిష్టాన్ని తాకింది.