ధోనీ మనసు దోచిన నల్ల కోడి.. ఎందుకో.. ఎంటో.. తెలుసా..

ధోనీ మనసు దోచిన నల్ల కోడి.. ఎందుకో.. ఎంటో.. తెలుసా..

కడక్​నాథ్​ కోళ్ల ఫామ్​ను స్వస్థలం రాంచీలో​ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ధోనీ బృందం.. దాదాపు రెండు వేల కడక్‌నాథ్ కోడి పిల్లల కోసం ఆర్డర్​ పెట్టినట్లు తెలుస్తోంది.

Sanjay Kasula

|

Nov 12, 2020 | 8:42 PM

ఆటగాడిగానే కాదు… మంచి బిజినెస్‌‌మేన్‌గా కూడా మాజీ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మంచి పేరుంది. అంతర్జాతీయ కెరీర్​కు ఆగస్టులో వీడ్కోలు పలికిన ధోనీ.. వ్యాపారాల్లో బిజీ మారబోతున్నాడు. ప్రధానంగా వ్యవసాయంపై దృష్టి పెట్టిన ధోనీ…దానికి అనుబంధంగా ఉండేవాటిపై కూడా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.

ఇందులో భాగంగా అత్యధిక పోషక విలువులున్న కడక్​నాథ్​ కోళ్ల ఫామ్​ను స్వస్థలం రాంచీలో​ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ధోనీ బృందం.. దాదాపు రెండు వేల కడక్‌నాథ్ కోడి పిల్లల కోసం ఆర్డర్​ పెట్టినట్లు తెలుస్తోంది.

మధ్యప్రదేశ్​ జబువా జిల్లాకు చెందిన ఓ పౌల్ట్రీ యజమానితో ధోనీ బృందం ఇప్పటికే సంప్రదింపులు జరిపింది. డిసెంబరు 15లోగా రెండు వేల కోడి పిల్లలను తమకు దిగుమతి చేయాలని కోరినట్లు పౌల్ట్రీ యజమాని వెల్లడించారు.

ఇప్పటికే అడ్వాన్స్ అందిందని.. దేశంలో ప్రముఖ క్రికెటర్లలో ఒకరికి తాను కడక్​నాథ్ కోళ్లు అమ్ముతుండటం తనకెంతో గర్వకారణమని సదరు యజమాని పేర్కొన్నాడు. మధ్యప్రదేశ్​లోని జబువా జిల్లాలో లభించే ఈ కడక్​నాథ్ కోళ్లకు 2018లోనే జీఐ ట్యాగ్​ కూడా లభించింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu