కర్నూలు ప్రాజెక్టులకు జల కళ

కర్నూలు జిల్లాలో భారీగా వస్తున్న వరద నీటితో జిల్లాలోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. దీంతో అటు ప్రభుత్వంలో.. ఇటు రైతుల్లో ఆంనందోత్సాహాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే...

కర్నూలు ప్రాజెక్టులకు జల కళ
Follow us

|

Updated on: Jul 10, 2020 | 6:52 PM

కర్నూలు జిల్లాలో భారీగా వస్తున్న వరద నీటితో జిల్లాలోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. దీంతో అటు ప్రభుత్వంలో.. ఇటు రైతుల్లో ఆంనందోత్సాహాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సుంకేసుల రిజర్వాయర్ పూర్తిగా నిండటంతో 4 వేల క్యూసెక్కుల నీటిని తుంగభద్రనదిలోకి వదిలారు.

సకాలంలో నైరుతి రుతుపవనాలు దక్షణ భారత దేశంలోకి ప్రవేశించడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు కర్నాటకలో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే 26 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరింది. అటు కృష్ణా నదికి కూడా నీటి వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది.