కరోనా ఎఫెక్ట్ :​ ఏప్రిల్​ 30 వరకు విమాన సర్వీసులు రద్దు..!

కరోనా ఎఫెక్ట్ :​  ఏప్రిల్​ 30 వరకు విమాన సర్వీసులు రద్దు..!

పుట్టిన చైనాలో త‌ప్ప ప్ర‌పంచ దేశాల‌లో క‌రోనా వీర‌విహారం చేస్తోంది. మెడిసిన్ కానీ, వ్యాక్సిన్ గానీ ఇంకా క‌నుగోన‌క‌పోవ‌డంతో తీవ్రత ఓ రేంజ్ లో ఉంది. దీంతో ప్ర‌పంచంలోని చాలా దేశాలు లాక్‌డౌన్ బాట ప‌ట్టాయి. ఇండియాలో కూడా ఏప్రిల్ 14వ‌ర‌కు లాక్‌డౌన్ లోనే ఉండ‌నుంది. కాగా లాక్‌డౌన్ మ‌రిన్ని రోజులు పెంచే అవ‌కాశాలు ఉన్న‌ట్టు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి విస్ప‌ష్ట ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి కీల‌క […]

Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Apr 08, 2020 | 10:00 PM

పుట్టిన చైనాలో త‌ప్ప ప్ర‌పంచ దేశాల‌లో క‌రోనా వీర‌విహారం చేస్తోంది. మెడిసిన్ కానీ, వ్యాక్సిన్ గానీ ఇంకా క‌నుగోన‌క‌పోవ‌డంతో తీవ్రత ఓ రేంజ్ లో ఉంది. దీంతో ప్ర‌పంచంలోని చాలా దేశాలు లాక్‌డౌన్ బాట ప‌ట్టాయి. ఇండియాలో కూడా ఏప్రిల్ 14వ‌ర‌కు లాక్‌డౌన్ లోనే ఉండ‌నుంది. కాగా లాక్‌డౌన్ మ‌రిన్ని రోజులు పెంచే అవ‌కాశాలు ఉన్న‌ట్టు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి విస్ప‌ష్ట ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా విమాన స‌ర్వీసుల‌పై ఆంక్ష‌లు ఉన్న నేప‌థ్యంలో.. కరోనా వైరస్ వ్యాప్తి త‌గ్గి, పరిస్థితి కంట్రోల్ లోకి వచ్చే వరకు విమాన ప్రయాణాలపై.. ఆంక్షలు ఉంటాయని హర్దీప్‌సింగ్‌ పూరి స్ప‌ష్టం చేశారు. అప్పటివరకు లోక‌ల్, ఇంట‌ర్నేష‌న‌ల్ విమాన ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో సహకరిస్తున్నదేశ ప్ర‌జ‌ల‌కు ఆయన  ధన్యవాదాలు తెలిపారు. ఈ క్ర‌మంలోనే ఏప్రిల్‌ 30వరకు ఇంట‌ర్నేష‌న‌ల్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఇండిగో విమానయాన సంస్థ ప్రకటించింది. ఇప్పటికే ఎయిర్​ఇండియా సైతం తన సర్వీసులను రద్దు చేసింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu