26న ఢిల్లీ శివారుల్లో 100 కి.మీ. పొడవునా ట్రాక్టర్ ర్యాలీ, రైతు సంఘాల నిర్ణయం, శాంతి యుతంగా సాగుతుందని భరోసా

ఈ నెల 26..గణ తంత్ర దినోత్సవం నాడు ఢిల్లీ శివారుల్లో 100 కి.మీ. పొడవునా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి.

  • Umakanth Rao
  • Publish Date - 9:05 pm, Sat, 23 January 21
26న ఢిల్లీ శివారుల్లో 100 కి.మీ. పొడవునా ట్రాక్టర్ ర్యాలీ, రైతు సంఘాల నిర్ణయం, శాంతి యుతంగా సాగుతుందని భరోసా

ఈ నెల 26..గణ తంత్ర దినోత్సవం నాడు ఢిల్లీ శివారుల్లో 100 కి.మీ. పొడవునా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. వీరి ర్యాలీకి పోలీసులు అనుమతి నిచ్చిన నేపథ్యంలో తాము శాంతి యుతంగా దీన్ని నిర్వహిస్తామని వారు భరోసా ఇచ్చ్చారు. పరేడ్ కి ఎలాంటి భంగం వాటిల్లదన్నారు. యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల రైతులు ఈ ర్యాలీని నిర్వహించనున్నారు. కాగా వీరికి, ప్రభుత్వానికి మధ్య జరిగిన 11 వ దఫా చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. తాజాగా శనివారం రాత్రి రైతు సంఘాలు మళ్ళీ సమావేశమై తమ భవిష్యత్ కార్యాచరణను నిర్దేశించుకోనున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.