ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో విషాదం..న‌టి ఉషా గంగూలీ క‌న్నుమూత‌

ప్రస్తుతం కరోనా ప్ర‌జ‌ల‌ను అత‌లాకుత‌లం చేస్తుంటే, ఇదే సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఓ బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. ప్రముఖ నటి, రంగస్థల కళాకారిణి ఉషా గంగూలీ (75) ఆక‌స్మాత్తుగా ప్రాణాలు విడిచారు. దక్షిణ కోల్‌కతాలో నివాసముంటున్న ఆమె గురువారం హార్ట్ అటాక్ తో మరణించినట్లు తెలిసింది. తన ఫ్లాట్‌లో ఉషా గంగూలీ అచేత‌నంగా పడి ఉండటాన్ని గుర్తించి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారని ఆమె ఫ్యామిలీ మెంబ‌ర్స్ వెల్ల‌డించారు. ఉషా గంగూలీ […]

ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో విషాదం..న‌టి ఉషా గంగూలీ క‌న్నుమూత‌
Follow us

|

Updated on: Apr 24, 2020 | 3:42 PM

ప్రస్తుతం కరోనా ప్ర‌జ‌ల‌ను అత‌లాకుత‌లం చేస్తుంటే, ఇదే సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఓ బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. ప్రముఖ నటి, రంగస్థల కళాకారిణి ఉషా గంగూలీ (75) ఆక‌స్మాత్తుగా ప్రాణాలు విడిచారు. దక్షిణ కోల్‌కతాలో నివాసముంటున్న ఆమె గురువారం హార్ట్ అటాక్ తో మరణించినట్లు తెలిసింది. తన ఫ్లాట్‌లో ఉషా గంగూలీ అచేత‌నంగా పడి ఉండటాన్ని గుర్తించి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారని ఆమె ఫ్యామిలీ మెంబ‌ర్స్ వెల్ల‌డించారు.

ఉషా గంగూలీ మరణవార్త తెలిసి పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఒక్క‌సారిగా షాక్ కి గుర‌య్యారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం ఉషా గంగూలీ మరణవార్త తెలిసి తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఆమె మరణం సినీ, నాటక రంగానికి తీరని లోటు అని అన్నారు. కాగా ప్ర‌స్తుతం కరోనా లాక్ డౌన్ కావ‌డంతో అతి కొద్దిమంది కుటుంబ సభ్యుల మధ్య ఆమె అంత్యక్రియలు ముగిశాయి.

జోధ్‌పూర్‌‌లో జన్మించిన ఉషా గంగూలీ.. బాల్యంలోనే భరతనాట్యం నేర్చుకొని హిందీ సాహిత్యం నేర్చుకోవడానికి కోల్‌కతాకు వచ్చారు. ఆ సమయంలోనే నాటక రంగంలో ప్రవేశించి మహాభోజ్, ఆంతర్యాత్ర, రుడాలి, కోర్ట్ మార్షల్స్ లాంటి నాటకాల్లో నటించి త‌న ప్ర‌తిభ‌తో ప్ర‌జ‌ల్ని ఆక‌ట్టుకున్నారు. ఆ తర్వాత ముఖ్తి, మానసి లాంటి సొంత నిర్మాణ సంస్థ‌ల‌ను స్థాపింపిన ఆమె అజయ్ దేవగణ్, ఐశ్వర్యరాయ్ నటించిన రెయిన్ కోట్ మూవీకి ర‌చ‌నా సహకారం అందించారు.