దుబ్బాక దంగల్ః నియోజకవర్గంలో వారి ఓట్లే కీలకం

దుబ్బాక నియోజకవర్గానికి భిన్నమైన చరిత్ర ఉంది. మూడు జిల్లాలను ఆనుకొని, ముగ్గురు హేమాహేమీలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల మధ్య ఉన్నది.

దుబ్బాక దంగల్ః నియోజకవర్గంలో వారి ఓట్లే కీలకం
Follow us

|

Updated on: Oct 31, 2020 | 1:03 PM

దుబ్బాక నియోజకవర్గానికి భిన్నమైన చరిత్ర ఉంది. మూడు జిల్లాలను ఆనుకొని, ముగ్గురు హేమాహేమీలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల మధ్య ఉన్నది. దుబ్బాక నియోజకవర్గాన్ని మొదట్లో రాజగోపాల్‌పేట పేరు మీద పిలిచే వారు. 1951లో తొలిసారిగా ఇక్కడ మోడల్‌ ఎన్నికలు నిర్వహించారు. 1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ కేవీ నారాయణరెడ్డి కమ్యూనిస్టుల మద్దతుతో గెలుపొందారు.

ఒకప్పుడు సిద్దిపేటకు దీటుగా నిలబడిన దుబ్బాక.. గత రెండు దశాబ్దాలుగా సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌ నియోజకవర్గాలతో పోలిస్తే అభివృద్ధిలో వెనుకబడిపోయిందనే అభిప్రాయం ఉంది. 1952లో రాజగోపాల్‌పేట కింద, ఆ తరువాత దొమ్మాట నియోజకవర్గంగా కొనసాగి.. 2009 నాటి నియోజకవర్గ పునర్విభజనలో మెదక్‌ డివిజన్‌లోని చేగుంటను కలుపుకుని ఐదు మండలాలతో దుబ్బాక నియోజకవర్గం ఏర్పడింది. 1957లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా రాజగోపాల్‌పేట నియోజకవర్గం దొమ్మాట నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. 1962లో ఎంకే మోహినొద్ద్దీన్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున గెలిచారు.

2017లో ఈ నియోజకవర్గంలోనే మరో రెండు కొత్త మండలాలు నార్సింగ్‌, రాయపోల్‌ కలుపుకుని ఏర్పాటయ్యాయి. దుబ్బాకలో 55,208 మంది ఓటర్లు ఉండగా, మిరుదొడ్డి 31,762, తొగుట 26,751, దౌల్తాబాద్‌ 23,032 మంది, రాయపోల్‌ 20,513 మంది, చేగుంట 32,829 మంది, నార్సింగ్‌ 8,215 మంది ఓటర్లతో కలిపి మొత్తం నియోజకవర్గంలో1,98,756 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 97,978 మంది, మహిళలు 1,00,778 మంది ఓట్లర్లున్నారు. మొదటి నుంచి దుబ్బాక నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలదే ఆధిపత్యంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ముదిరాజ్‌, గొల్లకుర్మ, గౌడ కులాలు ఎక్కువగా ఉన్నాయి. ఎస్సీల్లో మాదిగల ప్రభావం ఎక్కువగా ఉంది.

అత్యధికంగా నియోజకవర్గంలో ముదిరాజ్‌ కులస్తులు 41,000పైచిలుకు ఉంటారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కాగా తరువాత స్థానంలో మాదిగలు 23,000పైచిలుకు, మాలలు 11,000 మంది, గొల్లకుర్మలు 15,000, గౌడ్‌లు 14,000, పద్మశాలీలు 6వేలు, రజకులు 7వేలు, మున్నురు కాపులు 6వేల పైచిలుకు, రెడ్లు 9వేల పైచిలుకు, వైశ్యులు 3వేలు, ముస్లింలు 4వేలు, దూదేకుల కులస్తులు 2వేలు, వెలమలు 200, బ్రాహ్మణులు 500 మంది, ఎరుకలు 1,400 మంది, లంబాడీలు 4వేలు, బుడగజంగాలు 2వేల పైచిలుకు ఉన్నారు. బీసీలు అధికంగా ఉన్నప్పటికీ.. ఇక్కడ రెండు పర్యాయాలు మాత్రమే బీసీ వర్గానికి చెందిన ఐరేణి లింగయ్య ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనను గతంలో డిప్యూటీ స్పీకర్‌ పదవి వరించింది. అంతకుముందు 1962లో ఖాజామొహినుద్దీన్‌ కాంగ్రెస్‌ తరఫున గెలుపొందారు. 1985 నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు.

1967లో జరిగిన ఎం.భీమిరెడ్డి స్వతంత్య్ర అభ్యర్థిగా గెలిచారు. 1972లో దుబ్బాక మండలం చిట్టాపూర్‌కు చెందిన సోలిపేట రామచంద్రారెడ్డి (కాంగ్రెస్‌), 1978లో ఐరేని లింగయ్య (కాంగ్రెస్‌), 1983లో ఐరేని లింగయ్య (కాంగ్రెస్‌) రెండోసారి, 1985 మధ్యంతర ఎన్నికల్లో రామచంద్రారెడ్డి (టీడీపీ) గెలుపొందారు. 1989, 1994, 1999లో చెరుకు ముత్యంరెడ్డి (టీడీపీ) నుంచి గెలుపొందారు. 2004లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన జర్నలిస్టు నాయకుడు సోలిపేట రామలింగారెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2008 ఎన్నికల్లో రామలింగారెడ్డి గెలుపొందారు.

2009 సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమి తరపున చెరుకు ముత్యంరెడ్డికి టీడీపీ నుంచి టికెట్‌ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌లో చేరి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ముత్యంరెడ్డి విజయం సాధించారు. 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి 37,925 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసిన సోలిపేట రామలింగారెడ్డి సమీప ప్రత్యర్థి మద్దుల నాగేశ్వర్‌రెడ్డిపై 62,500 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దుబ్బాక నుంచి రామలింగారెడ్డి వరుస విజయాలు సాధిస్తూ వచ్చారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌గా రామలింగారెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజాసేవ చేశారు. అనారోగ్యంతో ఆగస్టు 6న రామలింగారెడ్డి మృతిచెందారు. దీంతో దుబ్బాక ఉప ఎన్నిక అనివార్యమైంది.

దుబ్బాక ప్రజలకు ప్రధాన జీవనాధారం వ్యవసాయం. అయితే, కరువు పరిస్థితుల కారణంగా రైతుల బతుకులు ఛిద్రమయ్యాయనే చెప్పవచ్చు. పంటలు పండించే పరిస్థితి లేక అన్నదాతలు వలస బాట పట్టారు. ఉన్న కొద్దిపాటి భూమిని కుదవపెట్టి, ఉపాధి నిమిత్తం ఇతర దేశాలకు వెళ్లారు. ఎక్కువగా గల్ఫ్ దేశాలకు వలస పోయారు. వ్యవసాయ కూలీలైతే ముంబైలో భవన నిర్మాణ కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం 1,58,829 ఎకరాల భూమి సాగులో ఉంది. వ్యవసాయం తర్వాత బీడీ పరిశ్రమ ద్వారా ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నారు. నాలుగు దశాబ్దాల క్రితం ఇక్కడ సుమారు 34 బీడీ కంపెనీలు ఉండగా.. ప్రస్తుతం ఏడు మాత్రమే కొనసాగుతున్నాయి. సుమారు 26,500 మంది పీఎఫ్‌ కార్మికులు, మరో 14,000 మంది నాన్‌పీఎ్‌ఫ కార్మికులు బీడీపరిశ్రమను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు.

వారికి మరో 3 నెలలు తిరుగులేదు.. అధికారం, ఆదాయం కలగలిసిన అధి యోగం
వారికి మరో 3 నెలలు తిరుగులేదు.. అధికారం, ఆదాయం కలగలిసిన అధి యోగం
డ్రగ్స్ కేసు‎లో వెలుగులోకి సంచలన విషయాలు.. ఎవరెవరున్నారంటే..
డ్రగ్స్ కేసు‎లో వెలుగులోకి సంచలన విషయాలు.. ఎవరెవరున్నారంటే..
ఇంకెప్పుడూ ఆంధ్రా జట్టుకు ఆడను.. హనుమ విహారి సంచలన నిర్ణయం
ఇంకెప్పుడూ ఆంధ్రా జట్టుకు ఆడను.. హనుమ విహారి సంచలన నిర్ణయం
రూ. 49కే 4 డజన్ల గుడ్లుని టెంప్ట్‌ అయితే రూ. 50 వేలు పోయాయి..
రూ. 49కే 4 డజన్ల గుడ్లుని టెంప్ట్‌ అయితే రూ. 50 వేలు పోయాయి..
Minister Roja: టీడీపీ గెలిస్తే రోజా భవిష్యత్తు ఏంటి ??
Minister Roja: టీడీపీ గెలిస్తే రోజా భవిష్యత్తు ఏంటి ??
అలా మాట్లాడాలని చాలా దేశాలు భారత్‌ను కోరుతున్నాయి.. కేంద్ర మంత్రి
అలా మాట్లాడాలని చాలా దేశాలు భారత్‌ను కోరుతున్నాయి.. కేంద్ర మంత్రి
ఈ ఇంటి అద్దె నెలకు రూ.లక్ష..! బాత్రూమ్ లేదు, వంటగది లేదు..!!
ఈ ఇంటి అద్దె నెలకు రూ.లక్ష..! బాత్రూమ్ లేదు, వంటగది లేదు..!!
మోహన్ బాబు మాస్ వార్నింగ్.. అలాంటివారిపై చర్యలు
మోహన్ బాబు మాస్ వార్నింగ్.. అలాంటివారిపై చర్యలు
ఆ రాశుల వారికి శని అనుకూలం! మంచి ఫలితాల కోసం ఈ పరిహారాలు చేయండి..
ఆ రాశుల వారికి శని అనుకూలం! మంచి ఫలితాల కోసం ఈ పరిహారాలు చేయండి..
హైదరాబాద్‌లో సిద్ధార్థ్ మల్హోత్రా, రాశి ఖన్నా సందడి
హైదరాబాద్‌లో సిద్ధార్థ్ మల్హోత్రా, రాశి ఖన్నా సందడి
Minister Roja: టీడీపీ గెలిస్తే రోజా భవిష్యత్తు ఏంటి ??
Minister Roja: టీడీపీ గెలిస్తే రోజా భవిష్యత్తు ఏంటి ??
కర్నూలు వైసీపీ విభేదాలపై మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి స్పందన
కర్నూలు వైసీపీ విభేదాలపై మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి స్పందన
టెక్నాలజీ సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలి - కేంద్ర మంత్రి
టెక్నాలజీ సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలి - కేంద్ర మంత్రి
శ్రీశైలంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఏసీబీ అధికారులు..
శ్రీశైలంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఏసీబీ అధికారులు..
వికసిత్‌ భారత్‌లో నారీశక్తి కీలకం - స్మృతి ఇరానీ
వికసిత్‌ భారత్‌లో నారీశక్తి కీలకం - స్మృతి ఇరానీ
చంద్రబాబుని నాయకుడిగా కంటే దేవుడిగానే చూస్తా- బుద్ధా వెంకన్న
చంద్రబాబుని నాయకుడిగా కంటే దేవుడిగానే చూస్తా- బుద్ధా వెంకన్న
వాట్ ఇండియా థింక్స్ టుడే.. మొదటి రోజు హైలైట్స్ వీడియో
వాట్ ఇండియా థింక్స్ టుడే.. మొదటి రోజు హైలైట్స్ వీడియో
మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతోంది
మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతోంది
అలా చెప్పేవారిని చెప్పుతో కొట్టండి.. బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు
అలా చెప్పేవారిని చెప్పుతో కొట్టండి.. బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు
50 ఏళ్ల తర్వాత చంద్రుడి పై దిగిన అమెరికా అంతరిక్ష నౌక.
50 ఏళ్ల తర్వాత చంద్రుడి పై దిగిన అమెరికా అంతరిక్ష నౌక.