‘ఒకే దేశం ఒకే రేషన్ కార్డు వద్దు’ : స్టాలిన్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒకే దేశం ఒకే రేషన్ కార్డు విధానం పై డీఎంకే పార్టీ విమర్శలు గుప్పించింది. ఈ విధానాన్ని అమలు చేసేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం జూన్‌ 30, 2020 వరకు గడువు విధించింది. దీనిపై డీఎంకే పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ స్పందిస్తూ.. సమాఖ్య విధానానికి ఇది వ్యతిరేకంగా ఉందని అన్నారు. ప్రజా పంపిణీ విధానం అనేది రాష్ట్ర ప్రభుత్వాల ప్రాథమిక హక్కు. ఇటువంటి హక్కును ఉల్లంఘిస్తే తలెత్తే పరిణామాల […]

'ఒకే దేశం ఒకే రేషన్ కార్డు వద్దు' : స్టాలిన్
Follow us

| Edited By:

Updated on: Jul 01, 2019 | 8:08 AM

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒకే దేశం ఒకే రేషన్ కార్డు విధానం పై డీఎంకే పార్టీ విమర్శలు గుప్పించింది. ఈ విధానాన్ని అమలు చేసేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం జూన్‌ 30, 2020 వరకు గడువు విధించింది. దీనిపై డీఎంకే పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ స్పందిస్తూ.. సమాఖ్య విధానానికి ఇది వ్యతిరేకంగా ఉందని అన్నారు. ప్రజా పంపిణీ విధానం అనేది రాష్ట్ర ప్రభుత్వాల ప్రాథమిక హక్కు. ఇటువంటి హక్కును ఉల్లంఘిస్తే తలెత్తే పరిణామాల గురించి కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్‌ విలాస్‌ పాసవాన్‌ అర్థం చేసుకోవట్లేదని అన్నారు. ఈ పథకం విషయంలో బీజేపీ తన నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు. ఇటువంటి వాటితో కేంద్ర ప్రభుత్వం తమ ఆధిపత్యాన్ని పెంచుకోవాలని యోచిస్తోందని స్టాలిన్ ఆరోపణలు చేశారు.