న‌టుడు విశాల్‌కి వ్య‌తిరేకంగా ద‌ర్శ‌కుడు భార‌తీరాజా సంచ‌ల‌న నిర్ణ‌యం

తమిళ సినీ నిర్మాతల మండలికి వ్యతిరేకంగా ద‌ర్శ‌కుడు భారతి రాజా సంచలన నిర్ణయం తీసుకున్నారు. నటుడు విశాల్‌ని టార్గెట్ చేస్తూ.. భారతి రాజా ఆధ్వర్యంలో కొత్త నిర్మాతల మండలి ఏర్పాటు చేశారు. ప్రస్తుత నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న నటుడు విశాల్ దాదాపు 7 కోట్లకు..

న‌టుడు విశాల్‌కి వ్య‌తిరేకంగా ద‌ర్శ‌కుడు భార‌తీరాజా సంచ‌ల‌న నిర్ణ‌యం

తమిళ సినీ నిర్మాతల మండలికి వ్యతిరేకంగా ద‌ర్శ‌కుడు భారతి రాజా సంచలన నిర్ణయం తీసుకున్నారు. నటుడు విశాల్‌ని టార్గెట్ చేస్తూ.. భారతి రాజా ఆధ్వర్యంలో కొత్త నిర్మాతల మండలి ఏర్పాటు చేశారు. ప్రస్తుత నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న నటుడు విశాల్ దాదాపు 7 కోట్లకు మేర అవినీతికి పాల్పడ్డాడ‌ని భారతి రాజా వర్గం ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. అలాగే తమిళ నిర్మాతలకు సంబంధించి ఎటువంటి మంచి జరగడం లేదంటూ, సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలను టార్గెట్ చేస్తూ దోచుకుంటున్నారంటూ ప‌లు విమ‌ర్శ‌లు చేశారు.

ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ భార‌తీరాజా మాట్లాడుతూ.. ప్రస్తుత నిర్మాతల మండలికి వ్య‌తిరేకంగా ఇటువంటి నిర్ణయం తీసుకోవ‌డం నన్ను బాధిస్తుంది. కానీ కొంతమంది నుండి నిర్మాతలను కాపాడటానికి ఇది నా ప్రయత్నం. నిర్మాతల భవిష్యత్తు కోసం నేను ప్రారంభిస్తున్న ఈ కొత్త సంఘానికి మద్దతుగా అందరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు దర్శకుడు భారతి రాజా.

Read More:

టాలీవుడ్ దర్శకుడు తేజకు క‌రోనా పాజిటివ్‌

మంత్రి కేటీఆర్‌కు రాఖీ క‌ట్టిన క‌విత‌

సోద‌రీమ‌ణులంద‌రికీ రాఖీ పండుగ‌ శుభాకాంక్ష‌లుః సీఎం జ‌గ‌న్

Click on your DTH Provider to Add TV9 Telugu