కూల్‌గా ప్రాక్టీస్ షూరూ చేసిన ధోని..

గతేడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని మళ్ళీ బ్యాట్ పట్టాడు. వచ్చే నెల 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న..

కూల్‌గా ప్రాక్టీస్ షూరూ చేసిన ధోని..

Dhoni Started Preparations For IPL: గతేడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని మళ్ళీ బ్యాట్ పట్టాడు. వచ్చే నెల 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న ఐపీఎల్ 13వ సీజన్‌ కోసం తన స్వస్థలమైన రాంచీలో ధోని నెట్స్‌లో సాధన చేస్తున్నాడు. గతవారమే జేఎస్సీఏ ఇంటర్నేషనల్‌ స్టేడియం ఇండోర్ కాంప్లెక్స్‌లో ధోని బౌలింగ్‌ మెషిన్‌ను ద్వారా బ్యాటింగ్ ప్రాక్టిస్ ఆరంభించినట్లు ఝార్ఖండ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫీస్‌ బేరర్‌ ఒకరు తెలిపారు.

కాగా, ఐపీఎల్ కోసం ఈ నెల 19న ఆటగాళ్లు అందరూ కూడా యూఏఈ పయనం కానున్నారు. అటు ఈ ఏడాది నుంచి వివో ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకోవడంతో నాలుగు బడా సంస్థలు టైటిల్ బిడ్ వేశాయి. వీరిలో ఎవరు టైటిల్ స్పాన్సర్ అవుతారన్న దానిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడననుంది. బీసీసీఐ ప్రస్తుతం ఐపీఎల్ షెడ్యూల్ పై ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Click on your DTH Provider to Add TV9 Telugu