రెండేళ్ల కిందట బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారంటూ ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, బాన్‌క్రాఫ్ట్ అనే ఆటగాళ్లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే! దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా కేప్‌టౌన్‌లో జరిగిన టెస్ట్‌లో ఈ సంఘటన జరిగింది.. అప్పట్లో ఈ ఘటన క్రికెట్ ఆస్ట్రేలియానే కాదు క్రికెట్ దేశాలన్నింటినీ కుదిపేసింది.. జెంటిల్మన్ గేమ్‌గా పేరొందిన క్రికెట్‌లో ఇలాంటి పనులు చేస్తారా అంటూ ముక్కున వేలేసుకున్నవాళ్లు కూడా ఉన్నారు.. ఉద్దేశపూర్వకంగా చేశారో లేక ఎవరో చెబితే చేశారో తెలియదు కానీ ఆ సంఘటన అయితే ఆటగాళ్లకు చెడ్డపేరే తెచ్చింది.. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్నారు.. బాన్‌క్రాఫ్ట్ తొమ్మిది నెలలు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు.. అయితే అప్పుడేం జరిగిందన్న విషయంపై ముగ్గురు ఆటగాళ్లు పెదవి విప్పలేదు.. నిజానిజాలు వివరించేందుకు బాల్ ట్యాంపరింగ్ ఘటనపై తన భర్త పుస్తకం రాయబోతున్నారని వార్నర్ భార్య క్యాండిస్ తెలిపింది.. బంతిని ఉద్దేశపూర్వకంగా మార్చాలనే ప్లాన్ వార్నర్‌దేనని కొందరు చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలన్నారు క్యాండిస్. అది వేరొకరి ప్రమేయంతో జరిగిందన్నారు.. వార్నర్ మేనేజర్ జేమ్స్ ఎర్క్‌సిన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వార్నర్ రాయబోయే పుస్తకంతో అన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పారు.