కుటుంబం ఆత్మహత్య కేసు : నంద్యాల సీఐ అరెస్ట్

పోలీసులు తప్పుడు కేసు పెట్టారంటూ  కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం ఏపీలో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఆరా తీసిన సీఎం జగన్..ఐజీ శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో  ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.  

కుటుంబం ఆత్మహత్య కేసు : నంద్యాల సీఐ అరెస్ట్
Follow us

|

Updated on: Nov 08, 2020 | 6:10 PM

పోలీసులు తప్పుడు కేసు పెట్టారంటూ  కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం ఏపీలో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఆరా తీసిన సీఎం జగన్..ఐజీ శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో  ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.  కమిటీ ఇప్పటికే నంద్యాలకు చేరుకుని విచారణ ప్రారంభించింది. అర్ అండ్ బీ అతిథి గృహంలో ఇతర పోలీసు అధికారులతో సమావేశమయ్యి వివరాలు తెలుసుకున్నారు కమిటీ సభ్యులు. కొంతమంది కానిస్టేబుళ్లను ప్రశ్నించారు. అబ్దుల్‌ సలాం ఆటోలో డబ్బు పోయినట్లు కంప్లైంట్ చేసిన భాస్కర్‌రెడ్డిని కూడా ఆర్‌అండ్‌బీ అతిథిగృహానికి పోలీసులు పిలిపించి వివిధ అంశాలపై ఆరా తీశారు. కాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ సోమశేఖర్‌రెడ్డిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు డీఐజీ వెంకట్రామిరెడ్డి తెలిపారు. కానిస్టేబుల్‌ గంగాధర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఆయన సస్పెండ్ అయ్యారు.  ఘటనపై మూడురోజుల్లో విచారణ పూర్తి చేస్తామని డీఐజీ వెల్లడించారు.

ఏం జరిగిందంటే : 

ఇటీవల కర్నూలు జిల్లా కౌలూరు వద్ద అబ్దుల్‌సలాం ఫ్యామిలీ రైలుపట్టాలపై ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తప్పుడు కేసు పెట్టారంటూ అబ్దుల్‌ తీసుకున్న సెల్ఫీ వీడియో నిన్న రాత్రి నుంచి సర్కులేట్ అవుతుంది. ఏడాది క్రితం బంగారం షాపులో చోరీ కేసులో అబ్దుల్‌ సలాంను నిందితుడిగా చేర్చారు. తాను చేయని దొంగతనం కేసులో తనపై ఒత్తిడి పెంచుతున్నారని.. అది భరించలేకే చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలో అబ్దుల్‌సలాం చెప్పారు.

Also Read :

దిండు కింద ఫోన్‌ పేలి వ్యక్తికి తీవ్ర గాయాలు

రాయ్ లక్ష్మి తండ్రి కన్నుమూత..నటి ఎమోషనల్ పోస్ట్

రైతులకు బేడీల ఘటనపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ