Cp waring to drunk and drivers: తాగి వాహనం నడుపుతున్నారా.? అయితే మీరు తీవ్రవాదే.. ఈ మాట అంటోంది ఎవరో కాదు.

మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోలీసులు ఎన్ని డ్రంక్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహించినా, జరిమానాలు విధించినా మందు బాబులు మాత్రం తాగి వాహనాలు నడపడం మానట్లేదు. అయితే.. మద్యం తాగి వాహనాలు నడిపే వారు...

Cp waring to drunk and drivers: తాగి వాహనం నడుపుతున్నారా.? అయితే మీరు తీవ్రవాదే.. ఈ మాట అంటోంది ఎవరో కాదు.
Follow us

|

Updated on: Dec 29, 2020 | 4:27 PM

Cp waring to drunk and drivers: మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోలీసులు ఎన్ని డ్రంక్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహించినా, జరిమానాలు విధించినా మందు బాబులు మాత్రం తాగి వాహనాలు నడపడం మానట్లేదు. అయితే.. మద్యం తాగి వాహనాలు నడిపే వారు టెర్రరిస్టులతో సమామని అంటున్నారు సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్. కొత్తేడాది వేడుకలు ప్రారంభంకానున్న నేపథ్యంలో డ్రంక్ డ్రైవ్‌లపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ క్రమంలోనే నగరంలో పెద్ద ఎత్తున డ్రంక్ డ్రైవ్‌ పరీక్షలను నిర్వహిస్తున్నారు. సోమవారం ఒక్కరోజే ఏకంగా 420 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పట్టుపడ్డారంటేనే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలను నిషేధించిన విషయం తెలిసిందే. ఈ విషయమై తాజాగా సీపీ సజ్జనార్ స్పందించారు. డ్రంక్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే పదేళ్ల జైలు శిక్ష పడేలా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని సీపీ స్పష్టం చేశారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, ఏఆర్‌తో పాటు ఎస్‌వోటీ పోలీసులు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పాల్గొంటారని తెలిపారు. నిబంధనలను అతిక్రమించిన వారికి కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. కాగా.. మద్యం తాగి వాహనం నడుపుతూ మొదటిసారి పట్టుబడితే రూ.10వేల జరిమానా‌, 6 నెలల జైలు శిక్ష, 3 నెలలు లైసెన్స్ రద్దు చేస్తామని. రెండోసారి పట్టుబడితే రూ.15 వేల ఫైన్‌, రెండేళ్ల జైలు శిక్ష, శాశ్వతంగా లైసెన్స్ రద్దు చేస్తామని హైదరాబాద్ పోలీసులు ఇటీవల హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Also read: రోడ్డు ప్రమాదం జరిగితే పెద్ద వాహనంపైనే కేసు..ఇదంతా నిన్నటి విధానం.. ఇకముందు ఇది కుదరదంటున్న సీపీ సజ్జనార్

Latest Articles
CCS ఏసీపీ ఇంట ACB ఆకస్మిక దాడులు.. గుట్టలుగా నోట్ల కట్టలు సీజ్!
CCS ఏసీపీ ఇంట ACB ఆకస్మిక దాడులు.. గుట్టలుగా నోట్ల కట్టలు సీజ్!
సొంతిల్లు కావాలా.. జస్ట్ ఈ టిప్స్ పాటించండి చాలు..
సొంతిల్లు కావాలా.. జస్ట్ ఈ టిప్స్ పాటించండి చాలు..
టార్గెట్ '29'.. ఐపీఎల్ చరిత్రలోనే కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
టార్గెట్ '29'.. ఐపీఎల్ చరిత్రలోనే కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
ఏపీ పాలిసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల
ఏపీ పాలిసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల
టాప్ ఫిట్‌నెస్ ఫీచర్లతో కొత్త స్మార్ట్ వాచ్.. స్టైలిష్ డిజైన్..
టాప్ ఫిట్‌నెస్ ఫీచర్లతో కొత్త స్మార్ట్ వాచ్.. స్టైలిష్ డిజైన్..
Horoscope Today: వారికి అదనపు రాబడి బాగా పెరుగుతుంది..
Horoscope Today: వారికి అదనపు రాబడి బాగా పెరుగుతుంది..
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని