COVID 19: కరోనా.. కరోనా.. కరోనా.. ఇప్పుడు ఎవరిని తట్టినా చెప్పే మాట ఇదే. ఈ మహమ్మారి వైరస్ వల్ల ప్రపంచదేశాల్ని గడగలాడుతున్నాయి. ఎవరైనా దగ్గినా.. తుమ్మినా కూడా అదొక పెద్ద నేరంగా అనిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 వేల మంది ఈ కోవిడ్ 19 కారణంగా మృతి చెందారు. అటు లక్షల్లో బాధితులు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇలా కరోనా వైరస్ వల్ల ఇప్పటివరకు ప్రజలు అన్ని బ్యాడ్ న్యూస్ వింటున్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా రసికప్రియులకు పోర్న్ హబ్ గుడ్ న్యూస్ అందించింది. తమ సైట్‌లోని ప్రీమియం కంటెంట్‌ను నెలరోజుల పాటు ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పించింది.
చైనాను అతలాకుతలం చేసిన కరోనా వైరస్ ప్రస్తుతం 116 దేశాలకు విస్తరించింది. అంతేకాక గత కొద్దిరోజులుగా చైనా చుట్టుపక్కల ఉన్న దేశాలలో కోవిడ్ 19 కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక తాజాగా కరోనా కారణంగా ఇటలీ వణుకుతోంది.
కరోనా వైరస్ కారణంగా ఇటలీలో ఇప్పటికే 1000కి పైగా మరణాలు సంభవించాయి. ఆ మహమ్మారిని నివారించేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రజలందరినీ గృహ నిర్బంధం చేయడమే కాకుండా ఎవరైనా రూల్స్ ఉల్లంఘిస్తే మూడు నెలలు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పోర్న్ హబ్ ఇటలీ ప్రజలకు బంపరాఫర్ ప్రకటించింది.
తమ వెబ్‌సైట్‌లో ఉన్న ప్రీమియం కంటెంట్‌ను నెలరోజులు ఫ్రీగా చూడొచ్చని రసికులకు వల విసిరింది. అంతేకాకుండా పోర్న్ హబ్ తన ఉదారతను కూడా చాటుకుంది. పోర్న్ హబ్‌కు అనుసంధాన వెబ్‌సైట్ అయిన మోడల్ హబ్‌కు మార్చి నెలలో వచ్చే ఆదాయాన్ని కరోనా బాధితుల సాయం కోసం ఉపయోగిస్తామని తెలిపింది. కాగా, కరోనా అన్ని దేశాలకు బ్యాడ్ న్యూస్ ఇస్తుంటే.. ఇటలీవాసులకు మాత్రం గుడ్ న్యూస్ అందించింది.
For More News:
ఏపీ ప్రభుత్వం సంచలనం.. కాపరుల కోసం సరికొత్త పథకం.!
సీఎం సారూ. స్కూళ్లకు సెలవులు వద్దు..!
కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్‌కు మిగిలింది 30 రోజులు మాత్రమే.!
రేవంత్ అక్రమాలు ఏపీలో కూడా.. టీఆర్ఎస్ నేత ఏమన్నారంటే.?
ఆ నలుగురితో వాట్సాప్ గ్రూప్.. ఆమేనా ఫస్ట్ లవ్ః ప్రదీప్