Spitting On Rotis: బట్ట బయలు చేసిన వీడియో , మీరట్ లో అనుచిత చర్య, రోటీలు చేస్తూ ఉమ్మి వేసిన వ్యక్తి అరెస్ట్.

| Edited By: Rajeev Rayala

Feb 22, 2021 | 2:21 PM

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగిన ఓ పెళ్ళిలో తాండూరీ రోటీలు చేస్తూ వాటిపై ఉమ్మివేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రొట్టెలను తాండూర్ లో వేసేముందు ఇతడు  చేసిన ఈ అనుచిత, అపభ్రంశ చర్య తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది..

Spitting On Rotis: బట్ట బయలు చేసిన వీడియో , మీరట్ లో  అనుచిత  చర్య, రోటీలు చేస్తూ  ఉమ్మి వేసిన వ్యక్తి అరెస్ట్.
Follow us on

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగిన ఓ పెళ్ళిలో తాండూరీ రోటీలు చేస్తూ వాటిపై ఉమ్మివేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రొట్టెలను తాండూర్ లో వేసేముందు ఇతడు  చేసిన ఈ అనుచిత, అపభ్రంశ చర్య తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇతడిని సోహైల్ గా గుర్తించారు. ఈ వర్కర్ చేసిన పనిని ఒకరు రహస్యంగా వీడియోగా చిత్రీకరించారు. ఇది సర్క్యులేట్ అవడంతో ఇతడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ హిందూ జాగరణ్  మంచ్ సభ్యులు, కార్యకర్తలు మీరట్ లోని స్థానిక పోలీసు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.  దీంతో పోలీసులు అతడి కోసం గాలించి అరెస్టు చేశారు. అతనిపై ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేశారు.

ఈ పెళ్లి విందులో సోహైల్ చేసిన పని నీచమైనదని, అమాయక జనాలను ఇది ఒకవిధంగా ‘ఛీట్’ చేయడమేనని హిందూ జాగరణ్ మంచ్ అధ్యక్షుడు సచిన్ సిరోహి అన్నారు. ఈ విధమైన ఘటనలను నివారించేందుకు పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు జరిగే స్థలాల వద్ద సీసీటీవీ కెమెరాలు అమర్చాలని ఆయన సూచించారు.

 

 

Also Read:

Ring In Garbage: చేజారిపోయిందనుకున్న వెడ్డింగ్ రింగ్.. మళ్లీ చేతికొచ్చింది.. ప్రేమకున్న పవర్ ఇదేనేమో.!

లీటర్ పెట్రోల్ ఒక రూపాయి 45 పైసలు..:Liter Of Petrol is One Rupee 45 Paise Video.