#AP Assembly జగన్ సర్కార్ ముందు రాజకీయ సంకటం

ఏపీ ప్రభుత్వానికి రాజకీయ సంకటం ఎదురైంది. మిగిలింది వారం రోజులే.. మరోవైపు కరోనా వైరస్ భయాందోళన.. రాష్ట్ర ప్రజలపై లాక్ డౌన్ అమలు. సభలు సమావేశాలు నిర్వహించవద్దని ఆదేశాలు. మరి ఆ సమావేశాలు తామే నిర్వహించాల్సి వస్తే ?

#AP Assembly జగన్ సర్కార్ ముందు రాజకీయ సంకటం
Follow us

|

Updated on: Mar 23, 2020 | 1:27 PM

Jagan government facing constitutional obligation: ఒక వైపు కరోనా వైరస్ ప్రభావం తో యావత్ భారత దేశం వణికిపోతూ అన్ని రకాల సమావేశాలను రద్దు చేస్తుంటే.. ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం తప్పనిసరిగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాల్సిన పరిస్థితి ఉత్పన్నం అయింది. కరోనా ప్రభావం తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్చ్ 31వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎక్కడా ముగ్గురు నలుగురికి మించి గుమికూడ వద్దంటూ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. నిత్యావసరాలకు సంబంధించిన దుకాణాలను, వ్యాపార సంస్థలను మాత్రం మినహాయించారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారికి సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. కానీ ప్రభుత్వమే ఆ ఆదేశాలను ఉల్లంఘించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

మార్చ్ 31 నాటికి వచ్చే ఆర్ధిక సంవత్సరానికి గాను రాష్ట్ర వార్షిక బడ్జెట్ ని ఆమోదించాల్సిన పరిస్థితి. 31వ తేదీ లోగా రాష్ట్ర ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభ ఆమోదించకపోతే ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ఖజానా నుంచి వినియోగించలేని పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. దీన్ని అవాయిడ్ చేయాలంటే మార్చ్ 31వ తేదీ లోగా రాష్ట్ర శాసనసభ, మండలిలో రాష్ట్ర వార్షిక ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందాలి.

అయితే ఇందుకోసం నేరుగా ఒకరోజు సమావేశం ఏర్పాటు చేసి ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించేసి.. వాయిదా వేసే పరిస్థితి ఉండదు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావాలంటే ఫార్మాలిటీ గా మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఏర్పాటు చేయాలి. అందుకు ఒక రోజు కావాలి. మర్నాడు గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపేందుకు పోతుంది.. సో.. రెండో రోజు కూడా బడ్జెట్ కుదరదు. మూడో రోజు బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి సరిపోతుంది. సాధారణంగా బడ్జెట్ ప్రవేశ పెట్టిన మర్నాడు బడ్జెట్ అధ్యయనానికి సభ్యులకు సమయం ఇచ్చేందుకు హాలిడే ఇస్తారు. అదేమంత కచ్చితం కాదు కాబట్టి నాలుగో రోజు బడ్జెట్ పై చర్చకు కేటాయించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రోజు బడ్జెట్ పద్దులపై చర్చలను అన్నింటిని గిలెటిన్ చేసేస్తే నేరుగా ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదింప చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

అయితే ఇదంతా విపక్షం ఎలాంటి ఆక్షేపణ, అభ్యంతరం చూపకపోతేనే సాధ్యం అవుతుంది. ఐతే. ఆంధ్ర అసెంబ్లీలో ఇపుడు విపక్షం ఏమంత బలంగా లేదు కాబట్టి గవర్నర్ ప్రసంగం (మొదటి రోజు) గవర్నర్ కు ధన్యవాదాలు (రెండవ రోజు) బడ్జెట్ ప్రతిపాదన (మూడో రోజు) బడ్జెట్ పై చర్చ, ఆమోదం (నాలుగో రోజు) పద్దులు గిలెటిన్ చేసేసి, ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం (ఐదో రోజు) సో.. ఐదు రోజుల పాటు అసెంబ్లీ సెషన్ నిర్వహించాల్సిన రాజ్యాంగ పరమైన ఆబ్లిగేషన్ ఇపుడు జగన్ ప్రభుత్వం ముందు ఉన్నది.

ఈ లెక్కన మార్చ్ 27న సభ సమావేశాలను ప్రారంభిస్తే.. మార్చ్ 31న ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదింపచేసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ మరో అంశం కీలకంగా మారింది. దానికి న్యాయ కోవిదుల సలహాలు జగన్ ప్రభుత్వానికి అవసరం అని పరిశీలకులు చెబుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో శాసన వ్యవస్థ అంటే శాసనసభతోపాటు శాసన మండలి కూడా. మండలి ని రద్దు చేస్తూ తీర్మానాన్ని కేంద్రానికి పంపినప్పటికీ కేంద్రం ఇంకా దాన్ని ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో బడ్జెట్ ఆమోదం కోసం ఉభయ సభలను సమావేశ పరచాలా లేక ఒక్క అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం పొందితే సరిపోతుందా? ఇదిప్పుడు మిలియన్ డాలర్స్ ప్రశ్నగా మారింది.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?