లాక్ డౌన్ 3 నెలలు పొడిగించాలి: కాంగ్రెస్ నేత డిమాండ్

తెలంగాణలో లాక్ డౌన్ మరో మూడు నెలలు పొడిగించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు జాగ్రత్తతో కేంద్ర ప్రభుత్వం కంటే ఎక్కువ రోజులు అంటే మే 7వ తేదీ దాకా లాక్ డౌన్ అమలు చేయడం దూరదృష్టితో కూడుకున్న నిర్ణయమని సదరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభినందించారు. 

లాక్ డౌన్ 3 నెలలు పొడిగించాలి: కాంగ్రెస్ నేత డిమాండ్
Follow us

|

Updated on: Apr 27, 2020 | 12:35 PM

తెలంగాణలో లాక్ డౌన్ మరో మూడు నెలలు పొడిగించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు జాగ్రత్తతో కేంద్ర ప్రభుత్వం కంటే ఎక్కువ రోజులు అంటే మే 7వ తేదీ దాకా లాక్ డౌన్ అమలు చేయడం దూరదృష్టితో కూడుకున్న నిర్ణయమని సదరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభినందించారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆయన వెరైటీ ఎమ్మెల్యే. ఎప్పుడు అధికార టీఆర్ఎస్ పార్టీని, ముఖ్యమంత్రి కేసీఆర్ ను పొగుడుతా రో ? ఎప్పుడు విమర్శిస్తారో? తెలియని పరిస్థితి. తాజాగా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ పై ఆయన స్పందించారు. ఆయనే సంగారెడ్డి నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎలియాస్ జయప్రకాష్ రెడ్డి.

కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేయడం ఒక్కటే మార్గమని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముందు జాగ్రత్తతో కెసిఆర్ విధించిన లాక్ డౌన్ ఇప్పుడిప్పుడే మంచి ఫలితాలను ఇస్తుందని, దాన్ని మరింత కాలం కొనసాగించడం ద్వారా కరోనీ వైరస్ వ్యాప్తిని పూర్తిగా నిరోధించవచ్చని జగ్గారెడ్డి అంటున్నారు పరిస్థితి మెరుగు పెడుతున్న సమయంలో లాక్ డౌన్ ఎత్తివేస్తే పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు

కష్టకాలంలో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది, పోలీసులను జగ్గారెడ్డి అభినందించారు వారికి ప్రజలు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రాణాలకు తెగించి మరీ విధులు నిర్వహిస్తున్న పోలీసులు, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి ప్రభుత్వమే అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.

లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో.. ఆర్థికవేత్తలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన కోరారు. ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వాలకు తగిన సూచనలు చేయాలని జగ్గారెడ్డి ఆర్థికవేత్తలను కోరారు.

ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు