“కామెంటరీ ఫ్రమ్ హోమ్”.. ఐపీఎల్ కొత్త ప్రయోగం

ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతున్న సమయంలో దక్షిణాఫ్రికాలో జరిగిన ఎగ్జిబిషన్​ మ్యాచ్​లో వర్చువల్​ కామెంటరీ పద్దతిని ప్రయోగాత్మంగా చేపట్టారు. ఇది విజయవంతం కావడం వల్ల.. ఐపీఎల్​లోనూ ఈ తరహా పద్దతికి....

కామెంటరీ ఫ్రమ్ హోమ్.. ఐపీఎల్ కొత్త ప్రయోగం
Follow us

|

Updated on: Jul 23, 2020 | 11:21 AM

ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతోంది. ఈ సమయంలో దక్షిణాఫ్రికాలో జరిగిన ఓ ఎగ్జిబిషన్​ మ్యాచ్​లో వర్చువల్​ కామెంటరీ పద్దతిని ప్రయోగాత్మంగా చేపట్టారు. ఇది విజయవంతం కావడంతో.. ఐపీఎల్​లోనూ ఇదే తరహా పద్దతికి శ్రీకారం చుట్టేందుకు ఆలోచనలు చేస్తున్నారు ఐపీఎల్ నిర్వాహకులు.

ఆదివారం దక్షిణాఫ్రికా సెంచూరియన్​ పార్క్​లో లైవ్​ గేమ్​ నిర్వహించగా.. ఇర్ఫాన్ పఠాన్​ బరోడాలోని తన నివాసం నుంచి కామెంటరీ చేశారు. కోల్​కతాకు చెందిన దీప్​ దాస్​గుప్తా, ముంబైకి చెందిన సంజయ్​ మంజ్రేకర్​ కూడా తమ ఇంటి నుంచే కామెంటరీ ఇస్తూ ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఇంత వరకు ఏ క్రీడలోనూ ఇలా వర్చువల్ కామెంట్రీ జరగలేదు. ఎక్కడో వేలాది కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న ఆటకు.. ఇంటి నుంచి కామెంటరీ ఇచ్చిన భారత మాజీ ఆల్​రౌండర్​ పఠాన్​ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Latest Articles