రైతులకు శుభవార్త: ఏపీ సీఎం

ప్రభుత్వ పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌. రోజుకో సంచలన నిర్ణయంతో దూసుకెళుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా రైతులకు సంబంధించిన మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ఏపీ సీఎం. గురువారం (27-06-2019) నుంచి వ్యవసాయానికి పగటిపూట‌ తొమ్మిది గంటల విద్యుత్ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారుల్ని ఆదేశించారు. బుధవారం విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన […]

రైతులకు శుభవార్త: ఏపీ సీఎం
Follow us

| Edited By:

Updated on: Jun 26, 2019 | 7:22 PM

ప్రభుత్వ పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌. రోజుకో సంచలన నిర్ణయంతో దూసుకెళుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా రైతులకు సంబంధించిన మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ఏపీ సీఎం.

గురువారం (27-06-2019) నుంచి వ్యవసాయానికి పగటిపూట‌ తొమ్మిది గంటల విద్యుత్ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారుల్ని ఆదేశించారు. బుధవారం విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.. పలు కీలక అంశాలపై వారితో చర్చించారు. విద్యుత్ సరఫరాపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ముఖ్యమంత్రి 60శాతం ఫీడర్లలో పంపుసెట్లకు పగటిపూట ఉచిత విద్యుత్ అమలు చేయాలని అధికారులకు సూచించారు. మిగతా 40శాతం ఫీడర్లలో పనులకు రూ.1700 కోట్లు విడుదల చేశారు. ఫీడర్లలో పనులు వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. 2020 జులై 30 నాటికి మిగతా ఫీడర్లలో 9 గంటల విద్యుత్ సరఫరా చేయాలన్నారు. ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని ముఖ్యమంత్రి అధికారులకు వివరించారు.

Latest Articles
ప్రేమపై నమ్మకం పెరిగింది.. అదితి రావు హైదరి.| 100 కోట్ల సంగతి ఇదే
ప్రేమపై నమ్మకం పెరిగింది.. అదితి రావు హైదరి.| 100 కోట్ల సంగతి ఇదే
కేజీఎఫ్ 3 పై అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ నీల్.. ఫ్యాన్స్ ఖుషీ..
కేజీఎఫ్ 3 పై అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ నీల్.. ఫ్యాన్స్ ఖుషీ..
ఏపీలో వైసీపీ పరిపాలన ఎలా జరుగుతోంది?
ఏపీలో వైసీపీ పరిపాలన ఎలా జరుగుతోంది?
వేసవిలో గ్రీన్‌ టీ తాగొచ్చా? రోజుకు ఎన్ని సార్లు తాగితే మంచిది..
వేసవిలో గ్రీన్‌ టీ తాగొచ్చా? రోజుకు ఎన్ని సార్లు తాగితే మంచిది..
ది క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌.. బాహుబలి. | వైజాగ్‌ తీరంలో దేవర పై స్కెచ్
ది క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌.. బాహుబలి. | వైజాగ్‌ తీరంలో దేవర పై స్కెచ్
ఈ ఎన్నికల యుద్ధంలో గెలిచేది తానే.. టీవీ9 ఇంటర్వ్యూలో ఏపీ సీఎం
ఈ ఎన్నికల యుద్ధంలో గెలిచేది తానే.. టీవీ9 ఇంటర్వ్యూలో ఏపీ సీఎం
నవోదయలో 1377 నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తు గడువు మళ్లీ పెంపు
నవోదయలో 1377 నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తు గడువు మళ్లీ పెంపు
కాంగ్రెస్ పార్టీకి శామ్ పిట్రోడా రాజీనామా..!
కాంగ్రెస్ పార్టీకి శామ్ పిట్రోడా రాజీనామా..!
మీకు పోలీసులు లేదా అధికారుల నుండి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయా?
మీకు పోలీసులు లేదా అధికారుల నుండి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయా?
శ్రీదేవిని గుర్తుచేస్తోన్న జాన్వీ కపూర్ చెల్లెలు..
శ్రీదేవిని గుర్తుచేస్తోన్న జాన్వీ కపూర్ చెల్లెలు..