లిక్కర్ ఎఫెక్ట్… చక్కా వెంకట నాగలక్ష్మి రాజీనామా

ఆమె రాజీనామాను దుర్గగుడి పాలకమండలి ఆమోదించింది. నిన్న కారు మాది కాదు. లిక్కర్‌తో తమకు సంబంధం లేదని చెప్పిన ఆమె.. ఇవాళ వెనక్కి తగ్గారు. ఆధారాలు బయటపడడం..జగ్గయ్య పేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆగ్రహం వ్యక్తం చేయడంతో...

లిక్కర్ ఎఫెక్ట్... చక్కా వెంకట నాగలక్ష్మి రాజీనామా
Follow us

|

Updated on: Oct 01, 2020 | 3:17 PM

అక్రమ మద్యం రవాణా కేసులో చక్కా వెంకట నాగలక్ష్మి దుర్గగుడి పాలకమండలికి రాజీనామా చేశారు. వెంటనే ఆమె రాజీనామాను దుర్గగుడి పాలకమండలి ఆమోదించింది. నిన్న కారు మాది కాదు. లిక్కర్‌తో తమకు సంబంధం లేదని చెప్పిన ఆమె.. ఇవాళ వెనక్కి తగ్గారు. ఆధారాలు బయటపడడం..జగ్గయ్య పేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాలకమండలికి సభ్యత్వానికి ఇవాళ రాజీనామా చేశారు.

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సీతారాంపురంలోని ఓ అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు పోలీసులు. కార్ డోర్ ఓపెన్ చెయ్యగానే.. బాటిళ్లకు బాటిళ్లు లిక్కర్‌ దొరికింది. అన్నీ లెక్కేస్తే.. 225 మద్యం బాటిళ్లు బయటపడ్డాయి.

సాధారణంగా తెలంగాణ నుంచి ఏపీకి రోజూ ఏదోచోట అక్రమమద్యం పట్టుబడుతూనే ఉంది. తాజాగా సీతారాంపురంలో దొరికింది. అయితే దొరికిన కారు విజయవాడ దుర్గ గుడి పాలకమండలి సభ్యురాలు వరలక్ష్మిది. మద్యం బాటిళ్లు పట్టుకున్న తర్వాత సీసాలు చూపించారు. కానీ.. కారు నెంబర్ కనిపించకుండా కవర్ చేశారు. ఇదేం చోద్యమని మీడియా ప్రశ్నించిన కాసేపటికి ఆ కవరింగ్ కట్ చేశారు. కవర్‌ తీస్తే కారు వారిదే అని తేలింది.

అక్రమ మద్యం వ్యవహారంలో నాకు ..నా కుటుంబసభ్యులకు ఎటువంటి సంభంధం లేదన్నారు వరలక్ష్మి. నా ఎదుగుదల చూడలేనివారే ఈ పని చేశారన్నారు. కావాలనే మా కారులో మద్యం పెట్టించారన్న ఆమె.. ఇదంతా ప్రతిపక్షం కుట్రే అన్నారు.

కారు ఓనర్‌గా ఉన్న వరలక్ష్మిని.. మద్యం బాటిళ్ల విషయమై ప్రశ్నించింది టీవీ9. అయితే.. కారు మాదే గానీ, అందులోకి లిక్కర్ ఎలా వచ్చిందో తెలీదు అంటున్నారామె. పోలీసులు వచ్చి చెబితే.. భర్త వెళ్లి చూశారని అంటున్నారు. డ్రైవర్‌ పని ఉంటుందన్న అనుమానంతో అతన్ని పోలీసులకు అప్పగించినట్లు చెబుతున్నారు వరలక్ష్మి.

అయితే ఈ వ్యవహారం సీరియస్‌గా మారింది. ఇటు జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా సీరియస్‌ అయ్యారు. దీంతో వెంటనే పాలకమండలి సభ్యత్వానికి వరలక్ష్మి రాజీనామా చేశారు. నిన్న కారు మాది కాదు. లిక్కర్‌తో తమకు సంబంధం లేదని చెప్పిన ఆమె ఇవాళ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. మద్యం అక్రమ రవాణా కేసులో కుమారుడు సూర్య ప్రకాష్ గుప్తా పై కేసు నమోదు చేశారు. డ్రైవర్ శివను అరెస్ట్ చేశారు పోలీసులు..

లిక్కర్‌ ఘటనకు బాధ్యత వహిస్తూ వరలక్ష్మి చేసిన రాజీనామాను ఆమోదించినట్లు చెప్పారు దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్‌ సోమినాయుడు. పాలకమండలి సభ్యులు అక్రమాలకు పాల్పడితే ఊరుకునేది లేదని అన్నారు. ప్రభుత్వానికి మచ్చరాకుండా పాలకమండలి సభ్యులు నడుచుకోవాలని సూచించారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?