సీటెట్ పరీక్ష తేదీలు వచ్చేశాయి…

కరోనా వ్యాప్తితో వాయిదా పడిన వివిధ రకాల పరీక్షలు ఇప్పుపుడిప్పుడే పట్టాలు ఎక్కుతున్నాయి.  ఇలా వాయిదాపడిన సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (C Tet) పరీక్ష తేదీలను సీబీఎస్సీ(CBSC) ప్రకటించింది.

సీటెట్ పరీక్ష తేదీలు వచ్చేశాయి...
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 05, 2020 | 5:23 PM

CTet 2020 : కరోనా వ్యాప్తితో వాయిదా పడిన వివిధ రకాల పరీక్షలు ఇప్పుపుడిప్పుడే పట్టాలు ఎక్కుతున్నాయి.  ఇలా వాయిదాపడిన సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (C Tet) పరీక్ష తేదీలను సీబీఎస్సీ(CBSC) ప్రకటించింది. పరీక్షను వచ్చే ఏడాది జనవరి 31న నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

అయితే ఈ ఏడాది మ‌రికొన్ని న‌గ‌రాల్లో ప‌రీక్ష కేంద్రాల‌ను కొత్త‌గా ఏర్పాటు చేస్తోంది. దీంతో పరీక్ష కేంద్రాలను మార్చుకునేవారికోసం నవంబర్ 7 నుంచి 16 వరకు అవ‌కాశం క‌ల్పించింది. దేశ‌వ్యాప్తంగా సుమారు 135 న‌గ‌రాల్లో ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌నున్నారు. www.ctet.nic.in వెబ్‌సైట్‌లో ప‌రీక్ష కేంద్రాల‌ను మార్చుకోవచ్చని వెల్లడించింది.

పరీక్షలో అర్హత సాధించడం ద్వారా కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు, టిబెటన్ పాఠశాలలు, ఇతర అన్‌ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలలతోపాటు టెట్ నిర్వహించని రాష్ట్రాల్లోని పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులుగా పనిచేయవచ్చు.

పరీక్ష విధానం..(పీఆర్‌టీ) (టీజీటీ)

  •  పేపర్-1: ప్రైమరీ స్టేజ్ (PRT): మొత్తం 150 మార్కులకు పేపర్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 5 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగోజీ, లాంగ్వేజ్-1, లాంగ్వేజ్-2, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.
  • పేపర్-2: ఎలిమెంటరీ స్టేజ్ (TGT): మొత్తం 150 మార్కులకు పేపర్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 3 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ &పెడగోజీ, లాంగ్వేజ్-1 , లాంగ్వేజ్-2 అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్/సోషల్ సైన్స్‌లో 60 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు