అసలు పాక్‌కి భారత్‌తో యుద్ధం చేసే సత్తా ఉందా..?

జమ్ముకశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్థాన్, భారత్ ల మధ్య దూరం మరింత పెరిగిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా భారత్‌తో యుద్ధానికి సిద్ధమంటూ పాకిస్థాన్ హెచ్చరికలు చేస్తూ వస్తోంది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం భారత్‌లోకి ఉగ్రవాదులను ఉసిగొల్పి.. అలజడి సృష్టించేందుకు ప్రయత్నాలు చేసినట్లు ఇప్పటికే నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. మొన్నటికి మొన్న పాక్ మంత్రి అణు యుద్ధం రావొచ్చు.. అక్టోబర్, నవంబర్‌లో […]

అసలు పాక్‌కి భారత్‌తో యుద్ధం చేసే సత్తా ఉందా..?
Follow us

| Edited By:

Updated on: Aug 31, 2019 | 6:18 AM

జమ్ముకశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్థాన్, భారత్ ల మధ్య దూరం మరింత పెరిగిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా భారత్‌తో యుద్ధానికి సిద్ధమంటూ పాకిస్థాన్ హెచ్చరికలు చేస్తూ వస్తోంది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం భారత్‌లోకి ఉగ్రవాదులను ఉసిగొల్పి.. అలజడి సృష్టించేందుకు ప్రయత్నాలు చేసినట్లు ఇప్పటికే నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. మొన్నటికి మొన్న పాక్ మంత్రి అణు యుద్ధం రావొచ్చు.. అక్టోబర్, నవంబర్‌లో యుద్ధం అంటూ ముహుర్తాలు కూడా పెట్టిన విధంగా వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ అంశంతో యుద్ధం మీరు మొదలు పెట్టారు.. దీనిని మేము ముగిస్తామంటూ పాక్ మంత్రి పేర్కొన్నారు. యుద్ధం వస్తే ఎంతకైనా తెగిస్తామంటూ ప్రకటనలు కూడా చేశారు. అయితే పాక్ మంత్రులు ఇలా వ్యాఖ్యలు చేస్తుంటే.. ఇమ్రాన్ ఖాన్ ప్రతిపక్షమైన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ బుట్టో చేసిన వ్యాఖ్యలు చూస్తే.. పాక్ కేవలం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. కశ్మీర్ అంశం ముగిసన అధ్యాయమని.. పాక్ ఆధీనంలో ఉన్న పీవోకేని కాపాడుకుంటే సరిపోతుందంటూ బుట్టో వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను చూస్తే.. పాకిస్థాన్ మంత్రులు చేస్తున్న ప్రకటనలు కేవలం భారత్‌ను భయపెట్టేందుకు మాత్రమే చేసేలా కనిపిస్తున్నాయి. పాకిస్థాన్‌ నేతలు తలాతోకా లేని ప్రకటనలను చేస్తున్నారు. ఇదంతా పాక్‌ నిస్సహాయతను ప్రపంచానికి తెలియజేస్తోందే తప్ప.. భారత్‌ను భయపెట్టలేకపోతోంది. దీనికి కారణం చిన్న చిన్న ఇబ్బందులున్నా.. భారత్‌ ఆర్థికంగా అత్యున్నత స్థితిలో ఉంది. కానీ అదే సమయంలో పాక్‌ ఆర్థికంగా అత్యంత ఘోరమైన స్థితిలో ఉంది. దివాల అంచులకు చేరి ఐఎంఎఫ్‌ దయతో కాలం వెళ్లదీస్తోంది. అందుకు బుధవారం అక్కడి ఇస్లామాబాద్ విద్యుత్ సంస్థ పాక్ ప్రధాని కార్యాలయానికి కరెంట్ చేస్తామంటూ చేసిన నోటీసులే ఉదాహరణ. పాక్ ప్రధాని కార్యాలయం రూ.41 లక్షల (పాక్ కరెన్సీ) ను బాకీ ఉందని.. ఇప్పటి వరకూ ఆ డబ్బును చెల్లించలేదంటూ ఆ సంస్థ కరెంట్ కట్ చేస్తామంటూ హెచ్చిరకలు జారీ చేసింది. ఈ ఒక్క పరిస్థితిని చూస్తే.. పాక్ ఆర్థిక వ్యవస్థ ఎంత ఘోరంగా ఉందో తెలుస్తోంది. అయితే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. 28 ఏళ్లలో దేశ పరిస్థితి ఇంత ఘోరంగా ఉండటం ఇదే తొలిసారంటూ విపక్షాలు మండిపడ్డాయి.గత ఏడాది ద్రవ్యలోటు రికార్డు స్థాయిలో 8.9శాతానికి చేరింది. వ్యయాలు విపరీతంగా పెరిగిపోతుంటే.. రాబడి మాత్రం పెరగటం లేదని డాన్‌ పత్రిక పేర్కొంది. గత 28ఏళ్లలో ఇంత ద్రవ్యలోటు ఎన్నడూలేదు. అభివృద్ధి పనుల నిధుల్లో 45శాతం కోత విధించినా ఈ పరిస్థితి నెలకొనడం చూస్తుంటే పాక్‌ ఆర్థిక కష్టాలు ఎలా ఉన్నాయో అర్థమవుతున్నాయి.

అయితే ఈ నేపథ్యంలో భారత్‌తో యుద్ధం అంటు కాలు దువ్వుతున్న పాకిస్థాన్‌కు అంత ఈజీ కాదు. పాక్‌ సైనిక బడ్జెట్‌ ఈ ఏడాది దాదాపు 17శాతం పెరిగింది. కానీ, భారత రక్షణ బడ్జెట్‌కు ఇది ఏ మాత్రం దరిదాపుల్లోకి కూడా రాదు. యద్ధం అంటే ఖర్చు భారీగా ఉంటుంది. దళాలను వ్యూహాత్మక ప్రాంతాలకు తరలించాలి. దీనికి భారీగా ఖర్చవుతుంది. ఇప్పుడు ఉంటున్న ఆయుధాలకు అవసరమైన మందు గుండు నిరంతరాయంగా సరఫరా చేసేలా కంపెనీలుకు ఆర్డర్లు ఇవ్వాలి. ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే ఎన్నో ఆంక్షలు ఉంటాయి. దీనికి డబ్బును ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. పాక్‌ మిత్రదేశాల్లో ఈ స్థాయిలో మందుగుండు సరఫరా చేయగలిగిన దేశం ఒక్క చైనానే. కానీ, చైనా వ్యాపారానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. భారత్‌తో ఆ దేశానికి వచ్చిన మిగులు ఆదాయం 57 బిలియన్‌ డాలర్లు .. ఇక పాక్‌తో వ్యాపారం కారణంగా మిగులు ఆదాయం 10 బిలియన్‌ డాలర్లు. వాణిజ్య యుద్ధంతో విలవిల్లాడుతున్న చైనా ఇప్పుడు కొత్తగా భారత్‌తో శత్రుత్వం పెంచుకొని ఆదాయాన్ని పొగొట్టుకోదన్న అభిప్రాయం. మరోపక్క అణ్వాయుధాల నిర్వహణ చాలా ఖర్చుతో కూడుకున్నది. భద్రత, తయారీ, మెటీరియల్‌, తరలింపు, అణు క్షిపణుల నిర్వహణ కోసమే భారీగా వెచ్చించాల్సి ఉంటుంది. ఇది పాక్‌ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఆ దేశ సైనిక బడ్జెట్‌లో సింహభాగం అణ్వాయుధాల నిర్వహణకే వెళ్లి పోతుంది. ఈ నేపథ్యంలో భారత్‌తో ప్రత్యక్ష యుద్ధం అంటే పాక్‌కు చావులాంటిదేనంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..