బీహార్‌లో ముగిసిన తుది విడత ఎన్నికల ప్రచారం

దేశ వ్యాప్తంగా అందరికీ ఆసక్తి కలిగిస్తోన్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది.. ఇవాళ సాయంత్రంతో గడువు ముగిసింది.. మొత్తం 78 స్థానాలకు ఎల్లుండి పోలింగ్‌ జరుగుతుంది.. మూడో దశ ఎన్నికల ప్రచారంలో ఎన్‌డీఏ తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదీ వివిధ సభలలో పాల్గొన్నారు.. మారుమూల జిల్లాలలో కూడా ఆయన పర్యటించారు. మొత్తం 12 ఎన్నికల సభలలో ఆయన పాల్గొన్నారు. ఎన్‌డీఏ కూటమికి ఓటు వేయాలని ఓటర్లను కోరారు. బీజేపీ సీనియర్‌ నేతలు రాజ్‌నాథ్‌సింగ్‌, జెపీ నడ్డా, యోగి […]

బీహార్‌లో ముగిసిన తుది విడత ఎన్నికల ప్రచారం
Follow us

|

Updated on: Nov 05, 2020 | 6:38 PM

దేశ వ్యాప్తంగా అందరికీ ఆసక్తి కలిగిస్తోన్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది.. ఇవాళ సాయంత్రంతో గడువు ముగిసింది.. మొత్తం 78 స్థానాలకు ఎల్లుండి పోలింగ్‌ జరుగుతుంది.. మూడో దశ ఎన్నికల ప్రచారంలో ఎన్‌డీఏ తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదీ వివిధ సభలలో పాల్గొన్నారు.. మారుమూల జిల్లాలలో కూడా ఆయన పర్యటించారు. మొత్తం 12 ఎన్నికల సభలలో ఆయన పాల్గొన్నారు. ఎన్‌డీఏ కూటమికి ఓటు వేయాలని ఓటర్లను కోరారు. బీజేపీ సీనియర్‌ నేతలు రాజ్‌నాథ్‌సింగ్‌, జెపీ నడ్డా, యోగి ఆదిత్యనాథ్‌లు కూడా ప్రచార సభలలో పాల్గొన్నారు. ఇక మహాగడ్బంధన్‌ తరఫున కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కూడా మాధేపుర, అరారియా జిల్లాలలో జరిగిన ఎన్నికల సభలలో పాల్గొన్నారు.. ఈవీఎంలను మోదీ ఓటింగ్‌ మెషిన్‌లంటూ ఎద్దేవా చేశారు. అధికారం నిలుపుకోవాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌, అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ధ్యేయంతో తేజస్వీ యాదవ్‌లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.. ఇవే తన చివరి ఎన్నికలంటూ ఓటర్ల సానుభూతి పొందడానికి నితీశ్‌ ప్రయత్నిస్తున్నారు. లోక్‌జనశక్తి పార్టీ నేత చిరాగ్‌ పాశ్వాన్‌ సభలకు కూడా జనం భారీగా రావడంతో ఇటు ఎన్‌డీఎ, అటు మహాగడ్బంధన్‌లలో గుబులు మొదలయ్యింది.. చిరాగ్‌ పాశ్వాన్‌ పార్టీ ఎవరి ఓట్లు చీలుస్తుందో తెలియడం లేదు. ఇక ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండే సీమాంచల్‌లో మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ప్రచారం చేశారు.. ఓట్ల లెక్కింపు ఈ నెల 10న జరుగుతుంది.

Latest Articles
తమ్ముడి కోసం మెగాస్టార్.. చట్టసభలకు పంపించండని రిక్వెస్ట్
తమ్ముడి కోసం మెగాస్టార్.. చట్టసభలకు పంపించండని రిక్వెస్ట్
డ్రెస్సింగ్ రూమ్‌లో కన్నీళ్లు పెట్టిన రోహిత్.. వైరల్ వీడియో
డ్రెస్సింగ్ రూమ్‌లో కన్నీళ్లు పెట్టిన రోహిత్.. వైరల్ వీడియో
లక్ష్మీదేవిని పూజించే ముందు ఇంట్లో ఈ వస్తువులుంటే తొలగించండి..
లక్ష్మీదేవిని పూజించే ముందు ఇంట్లో ఈ వస్తువులుంటే తొలగించండి..
ఆ హీరో చెయ్యాల్సిన ఆర్య అల్లు అర్జున్ చేసి హిట్ అందుకున్నాడు..
ఆ హీరో చెయ్యాల్సిన ఆర్య అల్లు అర్జున్ చేసి హిట్ అందుకున్నాడు..
తొలిసారి టీ20 ప్రపంచకప్ బరిలో ఉగాండా.. 43 ఏళ్ల ఆటగాడికి ఛాన్స్..
తొలిసారి టీ20 ప్రపంచకప్ బరిలో ఉగాండా.. 43 ఏళ్ల ఆటగాడికి ఛాన్స్..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి కోసం ఈ 9 విషయాలు మీకు తెలుసా !
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి కోసం ఈ 9 విషయాలు మీకు తెలుసా !
మరో ఫన్నీ వీడియో రిలీజ్ చేసిన ఆనంద్ మహీంద్రా
మరో ఫన్నీ వీడియో రిలీజ్ చేసిన ఆనంద్ మహీంద్రా
మే నెలలో మతిపోయే బైక్స్, స్కూటర్స్ లాంచ్.. !
మే నెలలో మతిపోయే బైక్స్, స్కూటర్స్ లాంచ్.. !
తినడానికి బతికున్న ఆక్టోపస్ ఆర్డర్.. డైనింగ్ టేబుల్‌పై పెట్టగానే
తినడానికి బతికున్న ఆక్టోపస్ ఆర్డర్.. డైనింగ్ టేబుల్‌పై పెట్టగానే
తెలంగాణ ఉద్యోగులకు ఆ 2 రోజులూ వేతనంతో కూడిన సెలవులు
తెలంగాణ ఉద్యోగులకు ఆ 2 రోజులూ వేతనంతో కూడిన సెలవులు