భారత్ అమ్ములపొదిలో మల్టీ-రోల్ ఎంహెచ్‌-60 సీహాక్‌ (రోమియో) హెలికాప్టర్లు..?

| Edited By:

Feb 20, 2020 | 9:37 PM

వచ్చే వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు ముందే భారత నావికాదళానికి 24 అమెరికన్ మల్టీ-రోల్ ఎంహెచ్‌-60 సీహాక్‌ (రోమియో) హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి 2.4 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని క్యాబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ (సిసిఎస్) బుధవారం ఆమోదించింది. క్యాబినెట్ కమిటీ ఒప్పందాన్ని క్లియర్ చేసినప్పటికీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌ పర్యటన సందర్భంగా దీనికి సంబంధించిన డీల్‌పై సంతకాలు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. ఇప్పటికిప్పుడు భారత అవసరాలు […]

భారత్ అమ్ములపొదిలో మల్టీ-రోల్ ఎంహెచ్‌-60 సీహాక్‌ (రోమియో) హెలికాప్టర్లు..?
Follow us on

వచ్చే వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు ముందే భారత నావికాదళానికి 24 అమెరికన్ మల్టీ-రోల్ ఎంహెచ్‌-60 సీహాక్‌ (రోమియో) హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి 2.4 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని క్యాబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ (సిసిఎస్) బుధవారం ఆమోదించింది.

క్యాబినెట్ కమిటీ ఒప్పందాన్ని క్లియర్ చేసినప్పటికీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌ పర్యటన సందర్భంగా దీనికి సంబంధించిన డీల్‌పై సంతకాలు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. ఇప్పటికిప్పుడు భారత అవసరాలు తీర్చడానికి ఇవి సరిపోతాయి. మేకిన్‌ ఇండియా కింద 123 హెలికాప్టర్లను తయారు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం భారత్‌ వినియోగిస్తున్న సీకింగ్‌ హెలికాప్టర్ల స్థానాన్ని ఇవి భర్తీ చేస్థాయి. వాస్తవానికి ఈ హెలికాప్టర్లు కేవలం రవాణాకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం సబ్‌మెరైన్ల కదలికలను పీ8ఐ విమానాలు చూసుకొంటున్నాయి.

కాగా.. చైనా సబ్‌మెరైన్ల కదలికలు హిందూ మహా సముద్రంలో పెరిగిపోవడంతో అటు అమెరికాకు.. ఇటు భారత్‌కు తలనొప్పిగా మారింది. దీంతో వీటికి కళ్లెం వేయాలంటే భారత్‌ను సబ్‌మెరైన్‌ యుద్ధతంత్రంలో బలోపేతం చేయాలని అమెరికా భావిస్తోంది. అందుకే ఇప్పటికే పీ8ఐ యుద్ధవిమానాలను విక్రయించింది. తాజాగా రోమియో హెలికాప్టర్లను కూడా విక్రయించేందుకు 2019లోనే ఆమోదముద్ర వేసింది. అమెరికా వీటి వినియోగం మొదలుపెట్టి దాదాపు దశాబ్దం దాటిపోయింది.

భారతదేశం కొనుగోలు చేస్తున్న రోమియో హెలికాప్టర్లు ఉపరితల క్షిపణులు, సబ్‌మెరైన్‌లను ఛేదించే టార్పెడోలను కలిగి ఉంటాయి. దీంతోపాటు సముద్రం ఒడ్డున అమర్చే ఆయుధ వ్యవస్థలను కూడా దీని సాయంతో ధ్వంసం చేయవచ్చు. యాంటీ షిప్‌ మిసైల్‌ వ్యవస్థలపై ఇది దాడి చేయగలదు. దీనిలో యాంటి ట్యాంక్‌ మిసైల్‌ అయిన హెల్‌ఫైర్‌ కూడా ఉంటుంది.