Undavalli Arun Kumar warns YS Jagan Government: ఈ మాజీ ఎంపీ ఒకరోజు జగన్‌ని తెగ పొగడేస్తారు. మా రాజశేఖర్‌రెడ్డి కొడుకు అంటారు. కరెక్ట్ లైన్‌లో వెళుతున్నారని కితాబు ఇస్తారు. ప్రశంసలు కురిపిస్తారు. కానీ అంతలోనే రూటు మార్చేస్తారు. ఉండవల్లి జగన్ లైన్‌లో ఉన్నాడు. ఎంతైనా ఆయన మిత్రుని కొడుకు కదా? అని అందరూ అనుకునే లోపే బహిరంగ లేఖలు రాస్తారు. కీలక సూచనలు చేస్తారు. మీరు రాంగ్ రూట్లో నడుస్తున్నారని హెచ్చరికలు జారీ చేస్తారు.
ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకసారి జగన్‌కు ప్రేమతో సూచనలు చేస్తారు. మరొకసారి హెచ్చరికలు జారీ చేస్తారు. ఇలా ఎందుకు జగన్ సర్కార్‌కు హెచ్చరికలు చేస్తున్నారని అంటే.. తానొక సిటిజన్ అని… తనకు ఆ స్వేచ్ఛ వుందని సెలవిస్తారు. మీడియా తనకు ప్రాధాన్యత ఇచ్చినన్ని రోజులు తన వెర్షన్ వినిపిస్తానని అంటారు. మొత్తానికి ఉండవల్లి ఇలా మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రాజశేఖర్ రెడ్డి కొడుకు మాట తప్పడు.. మడమ తిప్పడు అన్న నమ్మకంతో ప్రజలు ఓట్లు వేశారని.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అంటారు ఉండవల్లి. ప్రభుత్వాల తప్పులు ఎన్నడమే తనపని అని…. త్వరలో జగన్ సర్కార్ పై కూడా ఛార్జ్ షీట్ ఇస్తా అని అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్.
ఉండవల్లి అరుణ్ కుమార్ బేసిగ్గా కాంగ్రెస్ వాది. ఆయనకు బీజేపీ అంటే పడదు. ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయాలకు ఆయన మొదటి నుంచి వ్యతిరేకం. ఇటీవల వైసీపీ, బీజేపీకి దగ్గరవుతుందనే ప్రచారం నేపథ్యంలో ఉండవల్లి జగన్ సర్కార్ టార్గెట్‌గా విమర్శలు చేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు జగన్‌కు రాష్ట్ర పరిస్థితి, ఇతర అంశాలను తెలియజేసేందుకు ఉండవల్లి మాట్లాడారని కొందరు నేతలు అంటున్నారు. మొత్తానికి ఉండవల్లి వ్యాఖ్యలు ఏపీ రాజకీయంలో చర్చనీయాంశంగా మారాయి.
Also read: Lokesh discloses family assets