ఐసీయూలోనే బోరిస్ జాన్సన్.. వెంటిలేటర్ అవసరం లేదన్న డాక్టర్లు

కరోనా వ్యాధికి గురైన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ లండన్ లోని సెయింట్ థామస్ ఆసుపత్రిలో ఇంకా ఐసీయూ లోనే చికిత్స పొందుతున్నారు. మొదట ఆయనకు వెంటిలేటర్ అవసరమవుతుందని భావించిన డాక్టర్లు.. ఆ తరువాత ఆ అవసరం లేదని ప్రకటించారు. తీవ్ర అస్వస్థులుగా ఉన్నప్పటికీ ఆయన ప్రభుత్వ కార్యకలాపాల గురించి తెలుసుకుంటున్నారని వారు పేర్కొన్నారు. అయితే ప్రధానిగా తాత్కాలిక బాధ్యతలను జాన్సన్.. విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ కు అప్పగించారు. ప్రస్తుతం జాన్సన్ కు నాలుగు లీటర్ల […]

ఐసీయూలోనే బోరిస్ జాన్సన్.. వెంటిలేటర్ అవసరం లేదన్న డాక్టర్లు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 07, 2020 | 12:49 PM

కరోనా వ్యాధికి గురైన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ లండన్ లోని సెయింట్ థామస్ ఆసుపత్రిలో ఇంకా ఐసీయూ లోనే చికిత్స పొందుతున్నారు. మొదట ఆయనకు వెంటిలేటర్ అవసరమవుతుందని భావించిన డాక్టర్లు.. ఆ తరువాత ఆ అవసరం లేదని ప్రకటించారు. తీవ్ర అస్వస్థులుగా ఉన్నప్పటికీ ఆయన ప్రభుత్వ కార్యకలాపాల గురించి తెలుసుకుంటున్నారని వారు పేర్కొన్నారు. అయితే ప్రధానిగా తాత్కాలిక బాధ్యతలను జాన్సన్.. విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ కు అప్పగించారు. ప్రస్తుతం జాన్సన్ కు నాలుగు లీటర్ల ఆక్సిజన్ మాత్రమే అవసరమని, ఇతర రోగులకు 15 లీటర్ల ఆక్సిజన్ అవసరమవుతుందని డాక్టర్లు చెప్పిన విషయాన్ని డొమినిక్  రాబ్ గుర్తు చేశారు. జాన్సన్ క్షేమంగా ఉన్నారని, ఆయనకు మంచి చికిత్స లభిస్తోందని రాబ్ వెల్లడించారు. అలాగే బ్రిటన్ వ్యాప్తంగా కరోనా రోగులకు సేవలందిస్తున్న నేషనల్ హెల్త్ సర్వీసును ఆయన అభినందించారు. ప్రభుత్వ కార్యకలాపాలేవీ నిలిచిపోలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెందవల్సిన అవసరం లేదని, జాన్సన్ త్వరలోనే కోలుకుని  పూర్తి ఆరోగ్యవంతులవుతారని రాబ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Latest Articles