ఆ జట్టు కెప్టెన్‌కు కరోనా పాజిటివ్ ..

ఆ జట్టు కెప్టెన్‌కు కరోనా పాజిటివ్ ..

బంగ్లాదేశ్​ టెస్టు జట్టు కెప్టెన్​ మోమినుల్​ హక్​కు కోవిడ్ పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం అతడు హోమ్​ క్వారంటైన్​లోకి వెళ్లిపోయాడు. ఇదే విషయాన్ని బంగ్లాదేశ్​ క్రికెట్​ బోర్డు...

Sanjay Kasula

|

Nov 10, 2020 | 10:33 PM

Haque Tests Positive For Corona : బంగ్లాదేశ్​ టెస్టు జట్టు కెప్టెన్​ మోమినుల్​ హక్​కు కోవిడ్ పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం అతడు హోమ్​ క్వారంటైన్​లోకి వెళ్లిపోయాడు. ఇదే విషయాన్ని బంగ్లాదేశ్​ క్రికెట్​ బోర్డు (BCB) చీఫ్ ఫిజిషియన్​ డాక్టర్​ దేబాషిష్​ చౌదరి ధ్రువీకరించారు.

అయితే.. ఇదే విషయాన్ని స్వయంగా హక్ తన సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. గత రెండు రోజులుగా తనకు  జ్వరంగా ఉందని పేర్కొన్నాడు. కరోనా పరీక్ష చేయగా అందులో పాజిటివ్​ అని తేలిందని తెలిపాడు. ప్రస్తుతం జ్వరం తప్ప.. ఇతర లక్షణాలేవి కనిపించడం లేదని అన్నాడు.

ఇక మోమినుల్​కు మహమ్మారి సోకడం వల్ల మరో సీనియర్​ ఆటగాడు మహ్మదుల్లా రియాద్​పై ప్రభావం పడింది. దీంతో అతడు పాకిస్తాన్ సూపర్​ లీగ్​ ప్లే-ఆఫ్స్​లో పాల్గొనే అవకాశం కోల్పాయాడు.

దీంతో ఈ నెల చివర్లో జరగాల్సిన బంగాబందు టీ20 లీగ్​లో  కెప్టెన్ హక్​ పాల్గొనడం సందేహంగా మారింది. బంగ్లా క్రికెటర్లలో మష్రాఫ్​ మోర్తాజా, అబూ జయెద్​, సైఫ్​ హసన్​లు ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu