AP Local Body Elections Updates: ఏపీలో రసవత్తరంగా పంచాయతీ పోరు.. ముగిసిన తొలిదశ నామినేషన్ల పర్వం..  

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 31, 2021 | 6:05 PM

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తవరంగా మారింది. ఏపీలో ఓ వైపు నిమ్మగడ్డ రమేష్ కు ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం జరుగుతుండగా..

AP Local Body Elections Updates: ఏపీలో రసవత్తరంగా పంచాయతీ పోరు.. ముగిసిన తొలిదశ నామినేషన్ల పర్వం..  
AP Local Body Elections Live Updates: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తవరంగా మారింది. ఏపీలో ఓ వైపు నిమ్మగడ్డ రమేష్ కు ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం జరుగుతుండగా.. మరోవైపు ఎన్నికల్లో పట్టు సాధించాలనే లక్ష్యంతో ప్రధాన పార్టీలు బరిలోకి దిగాయి.  పంచాయతీ ఎన్నికలకు అధికారులు వడివడిగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నేటితో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. సాయంత్రం 5 గంటల నాటికి అభ్యర‌్థుల నామినేషన్ల పర్వానికి తెరపడింది. ఈ  రోజు తొలి విడత నామినేషన్లకు చివరి రోజు భారీ సంఖ్యలో దాఖలయ్యాయ.
రేపు అభ్యర్థుల నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు. తొలివిడత పోరులో నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 4 తుది గడువు.. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రకటిస్తారు. వెంటనే అభ్యర్థులకు గుర్తులు కూడా కేటాయిస్తారు. మొదటి దశ పోలింగ్ ఫిబ్రవరి 9న నిర్వహించనున్నారు. తొలి దశలో 3,249 పంచాయతీలు, 32,504 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. అదేరోజు ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఫలితాలు వెలువడతాయి. ఇక రెండో దశ పంచాయతీ ఎన్నికలకు ఫిబ్రవరి 2న నోటిఫికేషన్‌ వెలువడనుంది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 31 Jan 2021 05:40 PM (IST)

    ఏపీ పంచాయతీ పోరు.. 9న తొలివిడత పోలింగ్‌..

    ఏపీ పంచాయతీ మొదటి విడత ఎన్నికలు ఫిబ్రవరి 9న జరగనున్నాయి. తొలి విడత నామినేషన్ల ఘట్టానికి ఈ రోజు సాయంత్రంతో తెరపడింది. పంచాయతీ నామిషన్ల స్వీకరణ మొదటి రోజు శుక్రవారం 29న సర్పంచ్‌ కోసం 1317 మంది, వార్డు సభ్యుల కోసం 2200 మంది నామినేషన్లను దాఖలు చేశారు. 30న శనివారం సర్పంచ్‌ కోసం 7,460 మంది, వార్డు సభ్యుల కోసం 23,318 నామినేషన్లు దాఖలు చేశారు. ఈ రోజు దాఖలైన నామినేషన్లు, మొత్తం వివరాల మరికొంత సేపట్లో ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు.

  • 31 Jan 2021 05:39 PM (IST)

    పంచాయతీ పోరు.. ముగిసిన తొలి విడత నామినేషన్ల పర్వం..

    పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ సాయంత్రం 5గంటలతో ముగిసింది. ఈ రోజు చివరిరోజు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు బారీగా నామినేషన్లు వేశారు. పలు ప్రాంతాల్లో అవాంఛనీయ సంఘటనలు, వాగ్వివాదాలు మధ్యనే నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. దీంతోపాటు యథేచ్ఛగా కోడ్‌ ఉల్లంఘనలు సైతం జరిగాయి. రేపు నామినేషన్ల స్క్రూట్నీ జరగనుంది. అనంతరం నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 4వ తేదీ వరకు గడువు ఉంది.

  • 31 Jan 2021 04:49 PM (IST)

    రేపు, ఎల్లుండి ఉత్తరాదిలో పర్యటించనున్న నిమ్మగడ్డ..

    ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఫిబ్రవరి 1, 2 తేదీల్లో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. పంచాయతీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఆయన ఈ రోజు రాయలసీమలో పర్యటిస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనులు చేస్తున్నారు.

    సోమవారం.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పంచాయితీ ఎన్నికలపై అధికారులతో సమీక్షిస్తారు.. మరుసటి రోజు మంగళవారం.. విశాఖపట్నం, కాకినాడ, ఏలూరులో ఎస్ఈసీ పర్యటించనున్నారు.

  • 31 Jan 2021 04:48 PM (IST)

    మరి కాసేపట్లో ముగియనున్న మొదటివిడత నామినేషన్ల పర్వం..

    పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల ప్రక్రియకు తెరపడనుంది. ఈ రోజు చివరిరోజు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల స్క్రూట్నీ అనంతరం ఫిబ్రవరి 4వరకు ఉపసంహరణకు గడువు ఉంది.

  • 31 Jan 2021 04:42 PM (IST)

    పెద్దాపురంలో వైఎస్సార్, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వివాదం

    నామినేషన్ల సందర్బంగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఆర్బి పట్నంలో వైఎస్సార్ సీపీ, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

  • 31 Jan 2021 04:23 PM (IST)

    శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ వేయకుండా అడ్డుకున్న ప్రత్యర్థులు..

    శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం హనుమంతు నాయుడుపేట నామినేషన్ కేంద్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ బలపరిచిన సిల్లా గౌతమి నామినేషన్లు వేయకుండా ప్రత్యర్ధులు అడ్డుకున్నారు. రెండుసార్లు నామినేషన్‌ పత్రాలను చింపి భౌతిక దాడికి పాల్పడ్డారంటూ బాధితులు పేర్కొన్నారు. టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్ గానోరె, కాశిబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి చేరుకొని బాధితులతో మాట్లాడారు. అనంతరం డీఐజీ రంగారావు బాధితురాలితో మాట్లాడారు. దగ్గరుండి గౌతమితో నామినేషన్ వేయించాలని ఆయన ఎస్సైను ఆదేశించారు.

  • 31 Jan 2021 04:21 PM (IST)

    పంచాయతీ బరిలో కింజారపు అప్పన్న.. బెదిరించిన అచ్చెన్నాయుడు

    పంచాయతీ ఎన్నికల్లో భాగంగా శ్రీకాకుళం నిమ్మాడలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు కుటుంబీకుల మద్య వివాదం రాజుకుంది. అచ్చెన్నాయుడు భార్యపై.. ఆయన సోదరుడి కుమారుడు కింజరపు అప్పన్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. నామినేషన్‌ సైతం దాఖలు చేశారు. అయితే ఆ నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలంటూ అచ్చెన్నాయుడు కింజారపు అప్పన్నకు ఫొన్‌ చేసి బెదిరింపులకు దిగారు. అచ్చెన్నాయుడు, హరిప్రసాద్‌ వల్ల టీడీపీ హయాంలో తనకు అన్యాయం జరిగిందంటూ అప్పన్న ఆరోపించారు.

  • 31 Jan 2021 04:11 PM (IST)

    ఎమ్మెల్సీ దొరబాబు వాహనంపై దాడిని ఖండించిన టీడీపీ నేత అచ్చెన్నాయుడు

    చిత్తూరు జిల్లాలోని యాదమర్రి ఎంపీడీవో కార్యాలయం దగ్గర టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు వాహనంపై దాడిని ఆపార్టీ నాయకుడు అచ్చెన్నాయుడు ఖండించారు. దాడిచేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఏకగ్రీవాల పేరుతో వైసీపీ దాడులకు పాల్పడుతోందని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

  • 31 Jan 2021 04:00 PM (IST)

    రేపు ఉత్తరాంధ్ర బాట పట్టనున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్

    పంచాయతీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏర్పాట్లపై జిల్లాల్లో పర్యటించి అధికారులతో స్వయంగా సమీక్షిస్తున్నారు. ఈరోజు రాయలసీమ జిల్లాల పర్యటన ముగించుకొని నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ రేపు ఉత్తరాంధ్ర బాట పట్టనున్నారు. నేటితో మొదటి విడత నామినేషన్లు ఈ రోజు ముగుస్తుండటంతో ఆయన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

  • 31 Jan 2021 03:56 PM (IST)

    చేతులు కలిపిన వైసీపీ-టీడీపీ!

    పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఎప్పుడూ ఉప్పు.. నిప్పులా.. ఉండే వైసీపీ, టీడీపీ సర్పంచ్ ఎన్నికల్లో చేతులు కలిపినట్లు సమాచారం. ఈ సంఘటన కాకినాడ జిల్లాలోని తాళ్లరేవు మండలం లచ్చి పాలెంలో చోటుచేసుకుంది. ఈ మేరకు లచ్చి పాలెం గ్రామస్థులు వైసీపీ నుంచి అనిశెట్టి సీతారత్నంను సర్పంచ్‌గా.. టీడీపీ నుంచి గుత్తుల నూకరాజును ఉప సర్పంచిగా ఎన్నుకునేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

  • 31 Jan 2021 03:48 PM (IST)

    టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు వాహనంపై దాడి..

    టీడీపీ ఎమ్మెల్సీ రాజసింహులు (దొరబాబు) వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. చిత్తూరు జిల్లాలోని యాదమర్రి ఎంపీడీవో కార్యాలయం దగ్గర ఈ దాడి జరిగింది. పంచాయతీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించడానికి ఎమ్మెల్సీ దొరబాబు వెళుతుండగా... ఎంపీడీవో కార్యాలయం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు వాహనంపై దాడి చేశారు. పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు.

  • 31 Jan 2021 03:28 PM (IST)

    నిమ్మగడ్డ రమేష్‌ హామీ ఇచ్చారు.. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి..

    కడప జిల్లాలో పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ హామీ ఇచ్చారని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి పేర్కొన్నారు. నిమ్మగడ్డ రాయలసీమ పర్యటనలో భాగంగా.. నామినేషన్‌ సెంటర్ల వద్ద పోలీస్‌ బందోబస్తును పెంచాలని ఆయన ఎస్‌ఈసీని కలిసి విజ్ఞప్తి చేశారు. వాలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచాలని కోరినట్లు బీటెక్‌ రవి వెల్లడించారు.

  • 31 Jan 2021 03:22 PM (IST)

    రాజకీయ నేతలా వ్యవహరిస్తున్నారు.. నిమ్మగడ్డపై చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం..

    ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ రాజకీయ నేతలా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. రాయచోటిలో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ పదవిలో ఉంటూ ఓ పార్టీకి మేలు చేయాలని చూస్తున్నారంటూ నిమ్మగడ్డపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 2001లో ఏకగ్రీవాల జీవోను చంద్రబాబు నాయుడే తీసుకువచ్చారంటూ శ్రీకాంత్‌రెడ్డి గుర్తుచేశారు.

  • 31 Jan 2021 03:05 PM (IST)

    ఈసీ ఆదేశాలు బేఖాతరు.. పలుచోట్ల యథేచ్చగా కోడ్‌ ఉల్లంఘనలు

    నామినేషన్ల చివరి రోజు ఆదివారం ఏపీలో కోలాహలం నెలకొంది. భారీగా అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో పలుచోట్ల ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కోడ్‌ను ఉల్లంఘిస్తూ.. వాలంటీర్లు దగ్గరుండి వైసీపీ అభ్యర్థులతో నామినేషన్లు వేయిస్తున్నారని పలు పార్టీలు విమర్శిస్తున్నాయి. కర్నూలు జిల్లా మహానంది మండలం తమ్మడపల్లెలో వైసీపీకి మద్దతుగా వాలంటీర్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో అధికారులు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నారని ప్రతి పక్షాలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.

  • 31 Jan 2021 02:58 PM (IST)

    నామినేషన్‌ రగడ.. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో గొడవ..

    చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో నామినేషన్‌పై ఆదివారం గొడవ జరిగింది. మండలంలోని తలపునేనివారిపల్లి సర్పంచ్‌ స్థానానికి బీజేపీ నేత భార్య నామినేషన్‌ వేశారు. ఎప్పుడూ ఏకగ్రీవమయ్యే సర్పంచ్‌ పదవికి పోటీచేయడంపై టీడీపీ అభ్యంతరం తెలిపింది. దీంతో ఘర్షణ నెలకొంది. తమపై గ్రామస్తులు దాడిచేశారని సర్పంచ్‌ అభ్యర్థి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టీడీపీ నేతలపై కేసు నమోదైంది.

  • 31 Jan 2021 02:53 PM (IST)

    చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్‌..

    నిమ్మగడ్డతోపాటు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై కూడా ఎంపీ విజయసాయిరెడ్డి.. ఫైర్‌ అయ్యారు. గుళ్లు కూల గొట్టి, దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేసిన స్లీపర్ సెల్స్ కు బాబు కొత్త ఎజెండాను అప్పజెప్పినట్టుందని.. అవన్నీ సడన్ గా నిలిచిపోయాయంటూ ఆయన ట్విట్‌ చేశారు. పంచాయతీల్లో కులాలు, మతాల మధ్య, పేదల మధ్య చిచ్చుపెట్టే అసైన్ మెంటును ఆయన ఇచ్చి ఉంటారని.. ఘర్షణలు రెచ్చగొట్టి రక్తపాతాలు సృష్టించడం బాబుకు కొత్తేం కాదంటూ ట్విట్‌ చేశారు.

  • 31 Jan 2021 02:49 PM (IST)

    రెండు నెలల్లో దెబ్బకు దెయ్యం వదిలిపోతుందిః విజయసాయిరెడ్డి సంచలన కామెంట్స్‌..

    నిమ్మగడ్డపై ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగబద్ధ పదవి ముసుగులో 'చంద్ర'ముఖి ఆత్మ రాష్ట్రంలో తిరుగుతూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోందని ట్విట్‌ చేశారు. విధులను గాలికొదిలేసి రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుతోందని.. మరో రెండు నెలల్లో దెబ్బకు దెయ్యం వదిలిపోతుందంటూ నిమ్మగడ్డపై పరోక్షంగా ట్విట్‌ చేశారు.

  • 31 Jan 2021 02:47 PM (IST)

    ఎస్‌ఈసీ నిమ్మగడ్డపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్‌..

    స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ నాటి నుంచి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు.. ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా వైసీపీ నాయకుడు, ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్‌ ద్వారా మరోసారి నిమ్మగడ్డపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన వరుస ట్విట్లు చేశారు. కొద్ది మంది ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వంపైనే ఎస్‌ఈసీ దాడిచేస్తున్నారని ఆరోపించారు. అధికారులను బెదిరించే ఆయన ఉద్దేశపూర్వక చర్యల ఫలితం అన్ని విభాగాల మధ్య విభజనకు దారితీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వల్ల పాలనపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు.

  • 31 Jan 2021 02:33 PM (IST)

    తూర్పు గోదావరి జిల్లాలో సర్పంచ్‌ అభ్యర్థి భర్త కిడ్నాప్‌..

    పంచాయతీ నామినేషన్లు తొలివిడత చివరి రోజు ఏపీలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తూర్పు గోదావరి జిల్లా గొల్లలగుంటలో ఓ సర్పంచ్‌ అభ్యర్థి భర్తను ప్రత్యర్థి వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం కాళ్లు చేతులు కట్టేసి అడవిలో వదిలేశారు.

  • 31 Jan 2021 02:32 PM (IST)

    కృష్ణా జిల్లా శృంగవరప్పాడులో ఘర్షణ

    కృష్ణా జిల్లా శృంగవరప్పాడులో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఘర్షణ జరిగింది. ఎన్నికలు ఏకగ్రీవం చేయాలని ఓ వర్గం పట్టుబడుతోంది. మరోవర్గం పోటీ జరగాల్సిందేనంటూ పట్టుబట్టింది. దీంతో ఇరువర్గాలు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నాయి. పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను సముదాయించారు.

  • 31 Jan 2021 01:40 PM (IST)

    వారి ప్రలోభాలను తిప్పికొట్టండి.. టీటీపీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం..

    అన్నీ పంచాయతీల్లో వాలంటీర్ల ద్వారా వైసీపీ నాయకులు ప్రలోభ పెట్టాలని చూస్తున్నారని.. అలాంటి కుట్రలను తిప్పికొట్టాలని చంద్రబాబు టీడీపీ శ్రేణులకు సూచించారు. ఈ మేరకు ఆయన ఆదివారం టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు.

  • 31 Jan 2021 01:26 PM (IST)

    బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకోండిః టీడీపీ అధినేత చంద్రబాబు

    పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని సూచించారు.

  • 31 Jan 2021 01:24 PM (IST)

    అన్ని పంచాయతీల్లో టీడీపీ పోటీచేయాలి.. చంద్రబాబు నాయుడు

    పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీ శ్రేణులతో టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. అన్నీ పంచాయతీల్లో నామినేషన్లు వేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

  • 31 Jan 2021 01:22 PM (IST)

    పంచాయతీ పోరులో నోటా.. అభ్యర్థుల్లో గుబులు..

    ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని రోజుల్లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో నోటా గుర్తు కూడా ఉండనుంది. ఎన్నికల కమిషన్ ఇచ్చిన గుర్తులతోపాటు .. చివర్లో నోటా గుర్తుకూడా ఉండనుంది. అయితే ఈ ఎన్నికల్లో నోటా గుర్తు కూడా కీలకపాత్ర పోషిస్తుందని పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఆందోళనలు మొదలయ్యాయి.

  • 31 Jan 2021 01:07 PM (IST)

    పంచాయతీ ఎన్నికలపై బెజవాడ పోలీసుల నజర్‌..

    పంచాయతి ఎన్నికలకు మరికొన్ని రోజల సమయం మాత్రమే ఉంది. దీంతో ఇప్పటికే చాలాచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. పలు చోట్ల ఘర్షణలు సైతం జరిగాయి. దీంతో బెజవాడ పోలీసులు అలర్ట్‌ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. సమస్యాత్మక పోలింగ్‌ గ్రామాలలో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. రౌడీషీటర్లకు కౌన్సిలింగ్‌ నిర్వహించి ముందుగానే బైండోవర్ చేశారు. ఈ మేరకు కంకిపాడు మండలం వణుకూరులో పోలీసులు కవాతు నిర్వహించారు.

  • 31 Jan 2021 12:53 PM (IST)

    అభ్యర్థులకు కొత్త నిబంధనలు విధించిన కృష్ణా జిల్లా మైలవరం పంచాయతీ అధికారులు..

    పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కృష్ణా జిల్లా మైలవరం పంచాయతీ అధికారులు కొత్త నిబంధనలు విధించారు. పోటీ చేస్తున్న అభ్యర్థి అద్దెకుంటే ఆ ఇంటి యజమాని ఆస్తి పన్ను చెల్లిస్తేనే నామినేషన్ కు అనుమతిస్తామంటూ అధికారులు నిబంధనలు విధించారు. అభ్యర్థితో పాటు బలపర్చిన వారి ఇంటి పన్నును కూడా కట్టాలంటూ షరతులు విధించడంతో.. అధికారుల తీరుపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంపై వారు రిటర్నింగ్ అధికారులను ఆశ్రయించారు.

  • 31 Jan 2021 12:45 PM (IST)

    పక్క రాష్ట్రాల నుంచి భారీగా దిగుమతి అవుతున్న మద్యం..!

    ఏపీ పంచాయతీ ఎన్నికల్లో మద్యం ఏరులై పారుతోంది. పక్క రాష్ట్రాల నుంచి భారీగా ఏపీకు దిగుమతి అవుతోందని పలువురు పేర్కొంటున్నారు. అంతేకాకుండా రెండు రోజుల నుంచి పలుచోట్ల పోలీసులు భారీగా మద్యాన్ని సైతం స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇప్పటికే పెద్ద మొత్తంలో మద్యం పట్టుపడింది. శుక్రవారం నెల్లూరు జిల్లా కావలి ఆముదాలదిన్నెలో భారీగా మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఓటర్లకు మద్యం పంచుతున్న వ్యక్తిని సైతం అరెస్ట్ చేశారు.

  • 31 Jan 2021 12:38 PM (IST)

    పంచాయతీ ఎన్నికలు బహిష్కరించాలి.. మావోయిస్టుల లేఖ కలకలం..

    ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలపై ప్రాధాన పార్టీల మధ్య ఇప్పటికే వాడీవేడిగా విమర్శలు ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో మావోయిస్టుల లేఖ రాష్ట్రంలో కలకలం రేపింది. దోపిడీ పార్టీలను తరిమికొట్టాలని.. ఈ ఎన్నికలతో ఒరిగేదేమీ లేదంటూ విశాఖ ఈస్డ్‌ డివిజన్‌ కార్యదర్శి అరుణ పేరుతో మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. సాయుధ వ్యవసాయ విప్లవంలో భాగస్వామ్యం కావాలని.. గ్రామాల్లో విప్లవ ప్రజాకమిటీలను నిర్మించాలని పిలుపునిస్తూ విశాఖపట్నం ఏరియాలో విడుదల చేసిన లేఖ సంచలనంగా మారింది.

  • 31 Jan 2021 12:19 PM (IST)

    టెక్కలిలో టీడీపీ వర్గీయులను అడ్డగించిన వైసీపీ శ్రేణులు..

    శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం అయోధ్య పురం గ్రామ పంచాయతీలో నామినేషన్లు వేసేందుకు వచ్చిన టిడిపి వర్గీయులను వైసీపీ శ్రేణులు అడ్డగించారు. అంతేకాకుండా టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ పత్రాలను బలవంతంగా లాక్కొని సమీపంలోని నూతిలో పడేసి పరారయ్యరు. దీంతో బాధిత అభ్యర్థి పోలీసుల సహకారంతో ఎట్టకేలకు తిరిగి నామినేషన్ దాఖలు చేశారు. బాధిత వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు వైసీపీ శ్రేణులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • 31 Jan 2021 12:14 PM (IST)

    గుంటూరు సత్తెనపల్లిలో పోలిటికల్ హీట్..

    పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గుంటూరు సత్తెనపల్లిలో పోలిటీకల్ హీట్ నెలకొంది. అవినీతిపై వైసీపీ, టీడీపీ సోషల్‌ మీడియా వేదిక ద్వారా పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. అభివృద్ధి పనులను పట్టించుకోవటం లేదంటూ టీడీపీ నేత కోడెల శివరాం షాదీఖానా ఊడ్చి నిరసన తెలపగా.. శివరాం నిరసనపై వైసీపీ నాయకులు కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం వీరి కామెంట్స్‌ చర్చనీయాంశంగా మారాయి.

  • 31 Jan 2021 12:06 PM (IST)

    నామినేషన్ల కోసం కేంద్రాలకు క్యూ కడుతున్న అభ్యర్థులు

    పంచాయతీ నామిషన్ల మొదటి రోజు శుక్రవారం 29న సర్పంచ్‌ల కోసం 1315 మంది నామినేషన్లు, వార్డు సభ్యుల కోసం 2200 మంది నామినేషన్లు దాఖలు చేశారు. శనివారం సర్పంచ్‌ల కోసం 8773 మంది నామినేషన్లు వేయగా.. వార్డు సభ్యుల కోసం 25519 నామినేషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా భారీగా నామిషన్లు దాఖలు కానున్నాయి. ఇప్పటికే అభ్యర్థులు నామిషన్లు వేసేందుకు కేంద్రాలకు చేరుకున్నారు.

Published On - Jan 31,2021 5:40 PM

Follow us
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో