ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.40 కోట్లతో 13 మోడల్ డిగ్రీ కాలేజీలు..!

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు చాలా పరీక్షలు రద్దయ్యాయి. కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో ఏపీలో ప్రతి జిల్లాలోనూ ఒక డిగ్రీ కాలేజీని

  • Tv9 Telugu
  • Publish Date - 12:13 am, Thu, 30 July 20
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.40 కోట్లతో 13 మోడల్ డిగ్రీ కాలేజీలు..!

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు చాలా పరీక్షలు రద్దయ్యాయి. కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో ఏపీలో ప్రతి జిల్లాలోనూ ఒక డిగ్రీ కాలేజీని మోడల్‌ కళాశాలగా తీర్చి దిద్డాలని సీఎం వైఎస్‌ జగన్ నిర్ణయించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 13 మోడల్‌ డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ ఇన్స్‌టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్‌(ఎన్‌ఐఆర్ఎఫ్)కు పైలెట్ ప్రాజెక్టుగా 13 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలనే ఎంపిక చేసింది.

సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న ఏపీ సీఎం ఈ మోడల్‌ డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు రూ.40.62 కోట్లు ఖర్చు చేసేందుకు అనుమతి ఇచ్చారు. శ్రీకాకుళంలోని జీడీసీ (ఎం), విజయనగరం జిల్లా సాలూరులోని జీడీసీ,విశాఖలో డాక్టర్ వీఎస్ కృష్ణా జీడీసీ, రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ కాలేజీ (ఏ), పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఎసీఐఎం, కృష్ణా జిల్లా విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కాలేజీ, గుంటూరులో మహిళా డిగ్రీ కాలేజీ, ఒంగోలులో మహిళా డిగ్రీ కాలేజీ, నెల్లూరులోని డీకేడబ్ల్యూ కాలేజీ, అనంతపురంలో పురుషుల డిగ్రీ కాలేజీ, చిత్తూరులో పీవీకేఎన్, కర్నూలులోని సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజీ, కడపలోనిపురుషుల డిగ్రీ కాలేజీని ఎన్‌ఐఆర్ఎఫ్ పైలెట్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు.

Read More:

కరోనా ప్రభావం తగ్గగానే రచ్చబండ.. గ్రామాల్లో పర్యటన

కరోనా ఎఫెక్ట్: శ్రావణమాసం పెళ్లిళ్లు.. అన్నీ ‘పరిమితమే’!