రాజధానిపై మూడు ముక్కలాట..బిగ్ న్యూస్- బిగ్ డిబేట్

ఏపీ రాజధానిపై అనిశ్చితిని సీఎం జగన్‌ తెరదించారు. రాజధాని అమరావతిలోనే కొనసాగుతుందని ఇప్పటికే చెప్పిన ప్రభుత్వం, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగేశారు. ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు అన్న కాన్సెప్ట్‌ను జగన్‌ తెరమీదకు తీసుకురావడం ఇవాళ్టి బిగ్గెస్ట్‌ పొలిటికల్‌ బ్రేకింగ్‌ న్యూస్‌. చంద్రబాబు చెబుతూ వస్తున్న ఫార్ములాకు పూర్తిగా డిఫరెంట్‌ ఫార్ములాని సీఎం జగన్‌ తెరమీదకు వచ్చారు. చంద్రబాబు ప్రపంచమంతా తిరిగి రకరకాల డిజైన్లు తెస్తే, జగన్‌ మాత్రం దక్షిణాఫ్రికా ఫార్ములా తెచ్చారు. ఏపీ […]

రాజధానిపై మూడు ముక్కలాట..బిగ్ న్యూస్- బిగ్ డిబేట్
Follow us

|

Updated on: Dec 17, 2019 | 10:01 PM

ఏపీ రాజధానిపై అనిశ్చితిని సీఎం జగన్‌ తెరదించారు. రాజధాని అమరావతిలోనే కొనసాగుతుందని ఇప్పటికే చెప్పిన ప్రభుత్వం, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగేశారు. ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు అన్న కాన్సెప్ట్‌ను జగన్‌ తెరమీదకు తీసుకురావడం ఇవాళ్టి బిగ్గెస్ట్‌ పొలిటికల్‌ బ్రేకింగ్‌ న్యూస్‌. చంద్రబాబు చెబుతూ వస్తున్న ఫార్ములాకు పూర్తిగా డిఫరెంట్‌ ఫార్ములాని సీఎం జగన్‌ తెరమీదకు వచ్చారు. చంద్రబాబు ప్రపంచమంతా తిరిగి రకరకాల డిజైన్లు తెస్తే, జగన్‌ మాత్రం దక్షిణాఫ్రికా ఫార్ములా తెచ్చారు. ఏపీ రాజధాని ఒకేచోట కాకుండా మూడు చోట్ల ఉంటుంది. అమరావతిలో లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ ఉంటుంది. అంటే ఇక్కడ శాసనసభ, శాసన మండలి ఉంటాయి. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఉంటుంది. అంటే విశాఖలో పరిపాలన వ్యవస్థ ఉంటుంది. కర్నూలులో జ్యుడీషియరీ క్యాపిటల్‌ ఉంటుంది. అంటే రాయలసీమలో హైకోర్టు డిమాండ్‌ నెరవేరినట్లే. ఈ సీఎం జగన్‌ సభలో ప్రకటించారు. వారం రోజుల్లో నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

జగన్‌ చెబుతున్న వికేంద్రీకరణ కొత్త కాదు. మన దేశంలోనే పలు రాష్ట్రాల్లో ఈ పద్ధతి అమల్లో ఉంది. చత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ రాయ్‌పూర్‌లో ఉంది. హైకోర్టు బిలాస్‌పూర్‌లో ఉంది. గుజరాత్‌లో అసెంబ్లీ, పరిపాలన విభాగం గాంధీనగర్‌లో ఉంది. అహ్మదాబాద్‌లో హైకోర్టు ఉంది. కేరళలో తిరువనంతపురంలో సెక్రటేరియేట్‌, అసెంబ్లీ ఉన్నాయి. కొచ్చిలో హైకోర్టు ఉంది. మధ్యప్రదేశ్‌లో భోపాల్‌లో అసెంబ్లీ, సెక్రటేరియేట్‌ ఉన్నాయి. జబల్‌పూర్‌లో హైకోర్టు ఉంది. మహారాష్ట్రలో సమ్మర్‌ క్యాపిటల్‌ ముంబై, వింటర్‌ క్యాపిటల్‌ క్యాపిటల్‌ నాగ్‌పూర్‌లో ఉంది. ఒడిశాలోని భువనేశ్వర్‌లో పరిపాలన విభాగం, కటక్‌లో హైకోర్టు ఉంది. రాజస్థాన్‌లో జైపూర్‌లో పరిపాలన విభాగం, జోధ్‌పూర్‌లో హైకోర్టు ఉంది. ఉత్తర్‌ ప్రదేశ్‌లో లక్నోలో పరిపాలన, అసెంబ్లీ విభాగాలు ఉంటే, అలహాబాద్‌లో హైకోర్టు ఉంది. ఉత్తరాఖండ్‌లో డెహ్రాడూన్‌ అసెంబ్లీ, సెక్రటేరియేట్‌ ఉన్నాయి. నైనిటాల్లో హైకోర్టు ఉంది. జగన్‌ మూడు రాజధానుల ప్రకటనను చంద్రబాబు తుగ్లక్‌ పాలనతో పోల్చారు. ముఖ్యమంత్రి అమరావతిలో ఉంటాడా? విశాఖలో ఉంటాడా అని చంద్రబాబు ప్రశ్నించారు.

టీడీపీ, వైసీపీ మధ్య ఫ్లాష్‌ పాయింట్స్‌లో ఒకటైన అమరావతిపై సాగుతున్న రాజకీయ రచ్చ మరో మలుపు తిరిగింది. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని ఎన్నికల ముందునుంచీ ఆరోపిస్తున్న వైసీపీ అసెంబ్లీలో ఆధారాలు బయటపెట్టింది. చంద్రబాబుకి చెందిన హెరిటేజ్‌ కంపెనీతోపాటు, తన పార్టీ నేతల బంధువులు, బినామీలు కలపి 4070 ఎకరాలు కొనుగోలు చేశారన్నది వైసీపీ వేసిన బిగ్‌ బాంబ్‌. వైసీపీ ప్రభుత్వం చెబుతున్న 4070 ఎకరాల్లో భూములు ఎవరెవరికి ఉన్నాయో చూద్దాం..

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలు ఒకటైతే, తమ వాళ్లకు భూములిచ్చి, వాటిని ఆ తర్వాత రాజధాని ప్రాంతంలో కలిపేసుకోవడం అన్నది మరో అంశమని వైసీపీ ప్రభుత్వం వెలుగులోకి తెచ్చింది. ఇలా భూములు ఇచ్చిన, సీఆర్‌డీఏలో కలిపేసుకున్న భూములు 522 ఎకరాలు. అవి ఎవరివో చూద్దాం. అసెంబ్లీ చర్చ ద్వారా ప్రభుత్వం కొన్ని అంశాలను బలంగా చాటిచెప్పింది. రియల్‌ ఎస్టేట్‌ కోసమే రాజధాని అన్నది ఒకటి. ఒక సామాజిక వర్గానికే భూములు అన్నది మరొకటి. దళితుల భూములు లాక్కున్నారని ఇంకొకటి. ఇప్పటిదాకా చేస్తున్న ఆరోపణలకు ఆధారాలను చూపింది.

జగన్‌ మూడు రాజధానుల అంశాన్ని ప్రకటించడానికి ముందుగానే, తమ సభ్యుడు ధర్మాన ప్రసాద్‌రావుతో ఇదే అంశం చూచూయగా చెప్పించింది. మూడు వ్యవస్థలను మూడు ప్రాంతాలకు విభజించాలన్నది ఆ ఫార్ములా. పరిపాలన యంత్రాంగం, శాసనసభ, న్యాయవ్యవస్థ మూడు ప్రాంతాలకు విభజించాలని- రాజధాని చర్చను ప్రారంభించిన వైసీపీ సభ్యుడు ధర్మాన ప్రసాదరావు చెప్పారు. రాజధానిపై ఇప్పటిదాకా సాగుతున్న రాజకీయ రచ్చ కొత్త మలుపు తిరిగింది. ఈ విషయాలపై  టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ మార్క్ విశ్లేషణ.

Latest Articles
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..
ఆ సినిమా ప్రమోషన్స్‌కు మేము ఖర్చు పెట్టలేదు..
ఆ సినిమా ప్రమోషన్స్‌కు మేము ఖర్చు పెట్టలేదు..
మీకు ఆ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసా..? రిస్క్ తక్కువ లాభం ఎక్కువ
మీకు ఆ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసా..? రిస్క్ తక్కువ లాభం ఎక్కువ
13ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల తాత.బాలిక తండ్రి అరెస్ట్
13ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల తాత.బాలిక తండ్రి అరెస్ట్
ఆ రెండూ పథకాల్లో పెట్టుబడితో బాలికలకు అదిరే లాభాలు
ఆ రెండూ పథకాల్లో పెట్టుబడితో బాలికలకు అదిరే లాభాలు
ఈవీఎంలు, పోలింగ్ సిబ్బందితో వెళ్తున్న బస్సులో మంటలు..
ఈవీఎంలు, పోలింగ్ సిబ్బందితో వెళ్తున్న బస్సులో మంటలు..
హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఏడుగురు దుర్మరణం..
హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఏడుగురు దుర్మరణం..
మరో సూపర్ కారు రిలీజ్ చేసిన రెనాల్ట్..ఆకట్టుకుంటున్న టాప్ ఫీచర్స్
మరో సూపర్ కారు రిలీజ్ చేసిన రెనాల్ట్..ఆకట్టుకుంటున్న టాప్ ఫీచర్స్