రణబీర్, అలియాల పెళ్లి ఫోటో.. వావ్ అంటున్న నెటిజన్లు!

రణబీర్ కపూర్, అలియా భట్.. ఇప్పుడు బాలీవుడ్‌లో వీళ్లిద్దరూ చూడముచ్చటైన జంట. ఎక్కడ చూసినా జంటగా కనిపిస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు. ఇక వీరి ఫ్యాన్స్‌ అయితే వీళ్ళు ఎప్పుడెప్పుడూ పెళ్లి చేసుకుంటారా అని ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఫ్యాన్స్ ఒక అడుగు ముందుకేసి.. రణబీర్-అలియా పెళ్లి ఫోటోలను ఎడిట్ చేస్తున్నారు. గతంలో అలియా భట్ నటించిన వెడ్డింగ్ యాడ్‌లోని లుక్ వైరల్ అయింది. రణబీర్ ఫ్యాన్స్ అందరూ కూడా అలియాను చూసి ‘రణబీర్‌కి దుల్హన్’ అని కామెంట్స్ పెట్టారు. […]

రణబీర్, అలియాల పెళ్లి ఫోటో.. వావ్ అంటున్న నెటిజన్లు!
Follow us

|

Updated on: Sep 05, 2019 | 2:17 AM

రణబీర్ కపూర్, అలియా భట్.. ఇప్పుడు బాలీవుడ్‌లో వీళ్లిద్దరూ చూడముచ్చటైన జంట. ఎక్కడ చూసినా జంటగా కనిపిస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు. ఇక వీరి ఫ్యాన్స్‌ అయితే వీళ్ళు ఎప్పుడెప్పుడూ పెళ్లి చేసుకుంటారా అని ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఫ్యాన్స్ ఒక అడుగు ముందుకేసి.. రణబీర్-అలియా పెళ్లి ఫోటోలను ఎడిట్ చేస్తున్నారు.

గతంలో అలియా భట్ నటించిన వెడ్డింగ్ యాడ్‌లోని లుక్ వైరల్ అయింది. రణబీర్ ఫ్యాన్స్ అందరూ కూడా అలియాను చూసి ‘రణబీర్‌కి దుల్హన్’ అని కామెంట్స్ పెట్టారు. ఇక ఇప్పుడు అలియా, రణబీర్‌ల పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదీ కూడా రిషి కపూర్ 67వ పుట్టినరోజు నాడు ఫ్యాన్స్ ఎడిట్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

మరోవైపు వీళ్ళిద్దరూ 2020లో పెళ్లి పీటలు ఎక్కున్నట్లు తెలుస్తోంది. రణబీర్.. ఇప్పటికే మహేష్ భట్‌తో ఈ విషయంపై మాట్లాడినట్లు సమాచారం. ఏది ఏమైనా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.