అల్ -ఖైదాకి దెబ్బ.. దక్షిణాసియా చీఫ్ ఆసిం ఉమర్ హతం

అల్-ఖైదా దక్షిణాసియా చీఫ్ ఆసిం ఉమర్ హతమయ్యాడు. గత నెల దక్షిణ ఆఫ్ఘనిస్తాన్ లో యుఎస్-ఆఫ్ఘన్ దళాలు జరిపిన సంయుక్త దాడుల్లో ఉమర్ మరణించాడు. 2014 నుంచి భారత ఉపఖండంలో అల్-ఖైదా ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఇతగాడు.. గత నెల 23 న హెల్మండ్ ప్రావిన్స్ లోని మూసా-ఖలా జిల్లాలో తాలిబన్ల కాంపౌండ్ లోనే మృతి చెందినట్టు వార్తలు అందుతున్నాయి. ఉమర్ పాకిస్తానీ అని ఆప్ఘన్ లోని నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ వర్గాలు తెలిపాయి. అయితే […]

అల్ -ఖైదాకి దెబ్బ.. దక్షిణాసియా చీఫ్ ఆసిం ఉమర్ హతం
Follow us

| Edited By: Srinu

Updated on: Oct 09, 2019 | 7:06 PM

అల్-ఖైదా దక్షిణాసియా చీఫ్ ఆసిం ఉమర్ హతమయ్యాడు. గత నెల దక్షిణ ఆఫ్ఘనిస్తాన్ లో యుఎస్-ఆఫ్ఘన్ దళాలు జరిపిన సంయుక్త దాడుల్లో ఉమర్ మరణించాడు. 2014 నుంచి భారత ఉపఖండంలో అల్-ఖైదా ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఇతగాడు.. గత నెల 23 న హెల్మండ్ ప్రావిన్స్ లోని మూసా-ఖలా జిల్లాలో తాలిబన్ల కాంపౌండ్ లోనే మృతి చెందినట్టు వార్తలు అందుతున్నాయి. ఉమర్ పాకిస్తానీ అని ఆప్ఘన్ లోని నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ వర్గాలు తెలిపాయి. అయితే ఇతడు ఇండియాలో పుట్టాడని కూడా వార్తలు వచ్చాయి. మరో అయిదుగురు సభ్యులతో బాటు ఉమర్ హతమయ్యాడని, ఈ సభ్యుల్లో ఇద్దరు, ముగ్గురు పాకిస్థానీయులని తెలుస్తోంది. అయితే ఉమర్ మరణించాడన్న సమాచారాన్ని ఆఫ్ఘన్ తాలిబన్లు ఖండించారు. ఇది శత్రువుల దుష్ప్రచారమని, నమ్మదగినదిగా లేదని వారు పేర్కొన్నారు. గత నెల 22.. 23 తేదీలలో జరిగిన ‘ ఓవర్ నైట్ ఆపరేషన్ ‘ కు సంబంధించి పరస్పర విరుధ్ధమైన వార్తలు వస్తున్నాయి. యుఎస్ వైమానిక దళాలు కూడా జరిపిన ఆ దాడుల్లో ఉమర్ హతమయ్యాడట. పైగా ఆ ఆపరేషన్ లో పిల్లలతో సహా 40 మంది పౌరులు కూడా మృతి చెందినట్టు వఛ్చిన వార్తలపై ‘ దర్యాప్తు ‘ జరుపుతామని యుఎస్ అధికారులు అంటున్నారు. దళాల ఉపసంహరణ విషయంలో అమెరికా -తాలిబన్ మధ్య సంప్రదింపులు నిలిచిపోయినప్పటికీ..తమ సైనికులను వెనక్కి తీసుకుంటామని అమెరికా ప్రకటించింది. అయితే ఓ షరతు విధించింది. తాలిబన్లు అల్-ఖైదాతో అన్ని సంబంధాలను తెంచుకోవాలని, సెక్యూరిటీ గ్యారంటీలకు కట్టుబడి ఉండాలని సూచించింది. ఏమైనా-ఆసిం ఉమర్ నిజంగా హతమయ్యాడా, లేదా అన్నది ఇంకా నిర్ధారణ కావలసి ఉంది.

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..