ముద్దుల కొడుక్కి లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చిన ‘రియల్ హీరో’ ! ఏమిటా కథ ? ఏమిటా గిఫ్ట్ ..?

| Edited By: Phani CH

Jun 19, 2021 | 8:51 PM

కోవిద్ సంక్షోభంలో వేలాదిమందిని ఆదుకుని అందరికీ ఆప్తుడైన రియల్ హీరో సోను సూద్ ...తండ్రుల దినోత్సవం,,ఫాదర్స్ డే కి ఒకరోజు ముందే..

ముద్దుల కొడుక్కి లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చిన రియల్ హీరో !  ఏమిటా కథ ?  ఏమిటా గిఫ్ట్ ..?
Sonu Sood
Follow us on

కోవిద్ సంక్షోభంలో వేలాదిమందిని ఆదుకుని అందరికీ ఆప్తుడైన రియల్ హీరో సోను సూద్ …తండ్రుల దినోత్సవం,,ఫాదర్స్ డే కి ఒకరోజు ముందే.. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తన కుమారుడు ఇషాంత్ సూద్ కి చక్కని గిఫ్ట్ ఇచ్చాడు. జూన్ 20 ని ఫాదర్స్ డేగా పాటిస్తున్నాం మరి ! మరేం లేదు ! తన ముద్దుల కొడుక్కి ఆయన ఓ లగ్జరీ కారును బహుమతిగా అందజేశాడు. ఆ కుర్రాడి ఆనందంలో తానూ పాలుపంచుకున్నారు. బ్లాక్ కలర్ లో ఉన్న మెర్సిడెస్ మే బ్యాచ్ జీఎల్ఎస్ 600 టైప్ కారు ఖరీదెంతో తెలిస్తే వావ్ అనాల్సిందే! దీని ఖరీదు అక్షరాలా 3 కోట్ల రూపాయలట… తన డాడీ కొనిచ్చిన ఈ కాస్ట్లీ గిఫ్ట్ ని చూసి ఇషాంత్ సంతోషంతో ఉప్పొంగిపోయాడు. ముంబైలో లైట్ గా వర్షం పడుతున్న వేళ…సోనూ తన పిల్లలను ఈ వాహనంలో ఎక్కించుకుని అలా షికారు తిప్పాడు.. ‘డాడీ’ డ్రైవ్ చేస్తుండగా వాళ్ళు దీన్ని ఎంతగానో ఎంజాయ్ చేశారు. ఈ కారు విశేషాలు చాలానే ఉన్నాయి. టచ్ స్క్రీన్ ఇన్ ఫోటైన్ మెంట్, ఫైవ్ సీట్ వెర్షన్, బోలెడంత లగేజీ కెపాసిటీ ..ఇంకా చాలా చాలా ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

తన కొడుక్కి సోను సూద్ ఇస్తున్న ఈ కాస్ట్లీ వెరైటీ గిఫ్ట్ తాలూకు వీడియో వైరల్ అవుతోంది. అన్నట్టు ఈయనకు ఆడి క్యూ 7, మెర్సిడెస్ బెంజ్, పోష్ పనమేరా లాంటి ఇతర ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే..పృథ్వీరాజ్, ఆచార్య వంటి సినిమాలతో కూడా ఈ రియల్ హీరో చాలా బిజీగా ఉన్నాడు.

మరిన్ని ఇక్కడ చూడండి: TS Cabinet : క్షవర వృత్తిలో వున్న నాయీ బ్రాహ్మణుల కోసం గ్రామాల్లో మోడ్రన్ సెలూన్లను తక్షణమే ఏర్పాటు చేయండి : కేబినెట్

YS Sharmila Slams on Govt.: ప్రాణాలు పోతుంటే మీకేం పట్టదా.. పరిహారం చెల్లింపులో ఎందుకింత పరిహాసం.. సీఎంకు షర్మిల సూటిప్రశ్న