లవ్ బర్డ్స్ మధ్య బెట్టింగ్ తండ్రి.. ఆది, శ్రద్ధాల ‘జోడి’!

ఆది సాయి కుమార్, శ్రద్దా శ్రీనాధ్ ప్రధాన పాత్రల్లో నూతన దర్శకుడు విశ్వనాధ్ అరిగెల తెరకెక్కించిన రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘జోడి’. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను  విడుదల చేశారు. దాదాపు రెండు నిమిషాల నిడివి కలిగిన ఈ ట్రైలర్ లవ్, రొమాంటిక్ సన్నివేశాలతో సాగింది. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ బాగుంది. అంతేకాకుండా బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. సున్నితమైన ప్రేమ జంట మధ్య హీరో తండ్రి బెట్టింగ్ అడ్డుపడిందని ఈ ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. మంచి ప్రేమకథతో […]

  • Ravi Kiran
  • Publish Date - 1:20 pm, Thu, 29 August 19
లవ్ బర్డ్స్ మధ్య బెట్టింగ్ తండ్రి.. ఆది, శ్రద్ధాల 'జోడి'!

ఆది సాయి కుమార్, శ్రద్దా శ్రీనాధ్ ప్రధాన పాత్రల్లో నూతన దర్శకుడు విశ్వనాధ్ అరిగెల తెరకెక్కించిన రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘జోడి’. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను  విడుదల చేశారు. దాదాపు రెండు నిమిషాల నిడివి కలిగిన ఈ ట్రైలర్ లవ్, రొమాంటిక్ సన్నివేశాలతో సాగింది. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ బాగుంది. అంతేకాకుండా బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది.

సున్నితమైన ప్రేమ జంట మధ్య హీరో తండ్రి బెట్టింగ్ అడ్డుపడిందని ఈ ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. మంచి ప్రేమకథతో పాటు చిన్న సోషల్ మెసేజ్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లు అనిపిస్తోంది. సీనియర్ నటులు నరేష్, గొల్లపూడి మారుతీరావు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమెడియన్ల వెన్నెల కిషోర్, సత్యల కామెడీ బాగుంది. వచ్చే నెల 6వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.