30 శాతం కోవిద్ 19 కేసులు అవే: కేంద్రం

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. అయితే దేశంలో నమోదైన 30 శాతం కేసులు ఒక్క ప్రదేశానికి సంబంధించినవేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

30 శాతం కోవిద్ 19 కేసులు అవే: కేంద్రం
Follow us

| Edited By:

Updated on: Apr 04, 2020 | 7:12 PM

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. అయితే దేశంలో నమోదైన 30 శాతం కేసులు ఒక్క ప్రదేశానికి సంబంధించినవేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తబ్లిగీ జమాత్‌ సమ్మేళనం పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఈ విషయం పేర్కొంది. మొత్తం 17 రాష్ట్రాల్లో 1023 పాజిటివ్‌ కేసులు తబ్లిగీ జమాత్‌కు సంబంధం ఉన్నవేనని తెలిపింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు.

మరోవైపు.. సుమారు 22 వేల మంది తబ్లిగీ జమాత్‌ సభ్యులు క్వారంటైన్‌లో ఉన్నారని చెప్పారు. 17 రాష్ట్రాల్లోనూ కాంటాక్ట్‌ కేసుల ట్రేసింగ్‌ ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు. శుక్రవారం నుంచి ఇప్పటి వరకు 601 పాజిటివ్‌ కేసులు నమోదయయ్యియని లవ్‌ అగర్వాల్‌ చెప్పారు. ఇప్పటివరకు దేశంలో 3082 కేసులు, 86 మరణాలు చోటుచేసుకున్నట్టు వివరించారు.