లాల్‌బాగ్చా రాజా.. గణేష్ మండలి స్థలంలో.. రక్త, ప్లాస్మా దాన శిబిరం..

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ మహమ్మారి భారత్ లో కూడా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది వినాయక ఉత్సవాలు జరపరాదని ముంబై నగరంలోని లాల్‌బాగ్చా రాజా సర్వజనిక్ గణేశ్

లాల్‌బాగ్చా రాజా.. గణేష్ మండలి స్థలంలో.. రక్త, ప్లాస్మా దాన శిబిరం..
Follow us

| Edited By:

Updated on: Jul 01, 2020 | 10:51 AM

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ మహమ్మారి భారత్ లో కూడా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది వినాయక ఉత్సవాలు జరపరాదని ముంబై నగరంలోని లాల్‌బాగ్చా రాజా సర్వజనిక్ గణేశ్ ఉత్సవమండలి నిర్ణయించింది. కరోనా ప్రబలుతున్న ఆపత్కాలంలో లాల్‌బాగ్చా గణేశ్ ఉత్సవ మండలి స్థలంలో రోగుల కోసం రక్త, ప్లాస్మాదాన శిబిరం నిర్వహించాలని నిర్ణయించారు.ఇప్పటికే లాల్‌బాగ్చా గణేశ్ ఉత్సవ మండలి వైద్య పరీక్షల శిబిరాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తోంది.

కరోనా కట్టడికోసం ఈ ఏడాది మండలి స్థలంలో రక్త,ప్లాస్మా దాన శిబిరాలు నిర్వహిస్తూ, కేవలం 4 అడుగుల ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించి భక్తులు ఇంట్లో నుంచే ఆన్ లైన్ దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని మండలి నిర్ణయించింది. నాలుగు అడుగుల లోపు ఎత్తు గల వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించాలని, ఈ సారి వినాయ నిమజ్జనం ఉండదని సీఎం ఉద్ధవ్ థాకరే ప్రకటించిన నేపథ్యంలో లాల్‌బాగ్చా గణేశ్ ఉత్సవ మండలి ఈ నిర్ణయం తీసుకుంది.

[svt-event date=”01/07/2020,10:50AM” class=”svt-cd-green” ]

[/svt-event]